iDreamPost

Gold Price: కొత్త ఏడాది 2024లో మరింత షాకివ్వనున్న గోల్డ్ రేటు.. రూ.72 వేలకు చేరనున్న ధర

  • Published Dec 31, 2023 | 4:15 PMUpdated Dec 31, 2023 | 4:15 PM

2023 లో ఆల్ టైమ్ గరిష్టాలకు చేరుకున్న బంగారం ధర.. వచ్చే ఏడాది అనగా 2024లో మరింత పెరిగి.. పది గ్రాముల ధర ఏకంగా 72 వేలకు చేరుతుందని అంటున్నాు బులియన్ మార్కెట్ విశ్లేషకులు. ఆ వివరాలు..

2023 లో ఆల్ టైమ్ గరిష్టాలకు చేరుకున్న బంగారం ధర.. వచ్చే ఏడాది అనగా 2024లో మరింత పెరిగి.. పది గ్రాముల ధర ఏకంగా 72 వేలకు చేరుతుందని అంటున్నాు బులియన్ మార్కెట్ విశ్లేషకులు. ఆ వివరాలు..

  • Published Dec 31, 2023 | 4:15 PMUpdated Dec 31, 2023 | 4:15 PM
Gold Price: కొత్త ఏడాది 2024లో మరింత షాకివ్వనున్న గోల్డ్ రేటు.. రూ.72 వేలకు చేరనున్న ధర

బంగారం, భారతీయుల మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. మన వాళ్లకు బంగారం అంటే కేవలం విలువైన లోహం మాత్రమే కాదు.. అక్కరకు ఆదుకునే నేస్తం లాంటిది. అలానే మన దగ్గర చాలా మంది గోల్డ్ ని పెట్టుబడి సాధనంగా కూడా వాడతారు. ఇక ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే.. బంగారం దిగుమతిలో ఇండియా ప్రథమ స్థానంలో ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర పసిడి దిగుబడి తక్కువ.. డిమాండ్ ఎక్కువ. దానికి తగ్గట్టు పుత్తడి భారతదేశంలో లభించపోవడంతో.. ప్రపంచ దేశాల నుంచి గోల్డ్ ని దిగుమతి చేసుకుంటాము. ఇండియా దగ్గర ఉన్నంత పసిడి నిల్వలు మరో దేశం దగ్గర ఉండవన్నది వాస్తవం. మన దగ్గర వివాహాలు వంటి శుభకార్యాల వేళ మాత్రమే కాక.. పండుగల సందర్భంగా కూడా బంగారం కొనుగోలు చేస్తారు.

అయితే ఇప్పటికే మన దేశంలో బంగారం ధరలు ఈ ఏడాది గరిష్టాలకు చేరుకుంది. అలానే కిలో వెండి ధర 80 వేల రూపాయలకు పైగా అమ్ముడవుతోంది. ఇక దేశీయ బులియన్ మార్కెట్ లో క్రితం సెషన్ లో పుత్తడి ధర దిగి రాగా.. ఈ ఏడాది చివరి రోజు అనగా డిసెంబర్ 31 నాడు గోల్డ్ రేటు స్థిరంగా ఉంది. గత మూడేళ్ల నుంచి పసిడి ధర భారీగా పెరుగుతుంది. ఇక వచ్చే ఏడాది అనగా.. 2024లో కూడా బంగారం రేటు ఇలానే దూసుకుపోతుందని.. బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంచాన వేస్తున్నారు. కనుక గోల్డ్ రేటు భారీగా పెరగకముందే.. కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.

today gold rate

యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల మీద గోల్డ్ రేటు ఆధారపడి ఉంటుంది. అంతేకాక వచ్చే ఏడాది అనగా.. 2024లో మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాల్లో ఎన్నికలు ఉన్నాయి. దాంతో పాటు రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక మందగమనం వంటివి బంగారం ధర పెరుగుదలకు కారణం అవుతాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

72 వేలకు చేరనున్న ధర..

ప్రస్తుతం మన దేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ మేలిమి బంగారం ధర రూ.64 వేల స్థాయిలో ఉంది. అలానే వెండి ధర కిలో రూ.80 వేలకు పైగానే ఉంది. అయితే వచ్చే ఏడాది అనగా 2024లో పసిడి ధరలు మరింత పెరుగుతాయిని.. అంతేకాక త్వరలోనే 24 క్యారెట్ స్వచ్ఛమైన గోల్డ్ 10 గ్రాముల రేటు రూ.72 వేల మార్క్ దాటే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. అలాగే కిలో వెండి రేటు సైతం రూ.90 వేలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇక గత పది ఏళ్ల నుంచి గోల్డ్, సిల్వర్ ధరలు పరిశీలిస్తే.. 2013 ఏప్రిల్ నుంచి 2019 జూన్ వరకు అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు తక్కువగానే ఉన్నాయి. అప్పట్లో ఔన్సు గోల్డ్ రేటు 1200 నుంచి 1350 డాలర్ల స్థాయిలో ఉంది.

2024లో 2300 డాలర్లకు చేరే ఛాన్స్..

కానీ కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత.. బంగారం, వెండి ధరల్లో భారీగా పెరుగుదల చోటు చేసుకుంది. మూడేళ్ల క్రితం అనగా.. 2020లో ఔన్సు గోల్డ్ సగటు ధర 1775 డాలర్లు దాటగా.. 2021లో 1780 డాలర్లు ఉండగా.. 2022లో అది 1804 డాలర్లకు చేరింది. ఇక ఈ ఏడాది అనగా 2023, డిసెంబర్ 3వ తేదీన రికార్డు స్థాయిలో ఔన్సు బంగారం ధర 2152 డాలర్లకు చేరింది. ఇక నేడు ఔన్సు గోల్డ్ రేటు 2063 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఈ క్రమంలో వచ్చే ఏడాదిలో ఔన్సు పసిడి ధర 2150 నుంచి 2300 డాలర్లకు చేరుకునే అవకాశం ఉందంటున్నారు బులియన్ మార్కెట్ విశ్లేషకులు.

దీని ప్రకారం చూసుకుంటే దేశీయ బులియన్ మార్కెట్ లోనూ బంగారం ధర భారీగా పెరగనుందని అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది అనగా 2024లో 10 గ్రాముల మేలిమి గోల్డ్ రేటు రూ.72 వేల మార్క్ దాటి ట్రేడింగ్ అయ్యే సూచనలు ఉన్నాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కనుక బంగారం కొనాలనుకునే వారు.. ఇప్పుడే త్వరపడాలని సూచిస్తున్నారు.

ఇక గతేడాది ప్రారంభంలో అంటే 2022లో 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం రేటు రూ. 5,400 వద్ద అమ్ముడయ్యింది. ఈ ఏడాది అది గ్రాముకు రూ.6,400 కు చేరుకుంది. అంటే ఏడాది వ్యవధిలోనే పసిడి ధర గ్రాము మీద రూ.1000 మేర పెరిగింది. ఇక వచ్చే ఏడాది అనగా 2024లో అంతర్జాతీయంగా ఔన్సు గోల్డ్ రేటు రూ.2300 వరకు పెరిగే సూచనలు కనిపిస్తున్నందున దేశీయంగానూ గ్రాము పసిడి ధర రూ.7200లకు చేరే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి