pvenkatesh338
బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగాలన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మరి ఈ పోస్టులకు అర్హతలు ఏంటి? ఫీజు ఇతర వివరాలు మీకోసం..
బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగాలన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మరి ఈ పోస్టులకు అర్హతలు ఏంటి? ఫీజు ఇతర వివరాలు మీకోసం..
pvenkatesh338
మీరు చదువు పూర్తి చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? బ్యాంకు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? బ్యాంకు ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమా? అయితే మీలాంటి వారికి ఓ శుభవార్త. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రక్రియను చేపట్టింది. తాజాగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 8773 జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
స్టేట్ బ్యాంక్‌లో క్లరికల్ కేడర్‌లో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్)గా నియామకం కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకు ఎస్బీఐ భారీ స్థాయిలో నియామకాలను చేపట్టనుంది. 8773 క్లర్క్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నవంబర్ 17 నుంచి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపింది. కాగా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. అభ్యర్థులు డిసెంబర్ 07 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోదలచిన వారు మరింత సమాచారం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ https://sbi.co.in/web/careers ను సందర్శించాలని కోరింది.
ముఖ్యమైన సమాచారం:
మొత్తం పోస్టులు
8773
విద్యార్థత :
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే.
వయోపరిమితి:
అభ్యర్థుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ(జనరల్/ ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ :
ఆన్‌లైన్ టెస్ట్, స్థానిక భాష పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేపడతారు.
ఫీజు
జనరల్, ఓబీసీ, ఈడబ్య్లూఎస్ అభ్యర్థులు రూ. 750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్య్లూడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు.
అప్లికేషన్ విధానం :
ఆన్‌లైన్
అప్లికేషన్ ప్రారంభతేదీ:
నవంబర్ 17, 2023
అప్లికేషన్ చివరితేదీ :
డిసెంబర్ 7, 2023
అధికారిక వెబ్‌సైట్:
https://sbi.co.in/web/careers