iDreamPost

Bheemla Nayak New Release Date : చివరి నిమిషంలో ఎస్ చెప్పడానికి కారణాలు

Bheemla Nayak New Release Date : చివరి నిమిషంలో ఎస్ చెప్పడానికి కారణాలు

ఎంత ప్రచారం జరిగినా నిన్నటిదాకా భీమ్లా నాయక్ వాయిదా పడదనే అభిమానులు ఇప్పటిదాకా నమ్ముతూ వచ్చారు. దానికి కారణం నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ కాన్ఫిడెన్స్. ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో జనవరి 12ని పదే పదే నొక్కి వక్కాణిస్తూ ఫాన్స్ కి మంచి హైప్ ఇచ్చింది ఈయనే. తీరా చూస్తే ఇప్పుడు పోస్ట్ పోన్ తప్పలేదు. కారణాలు ఊహించినవే అయినా పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతి బరిలో నుంచి తప్పుకోవడం ఇష్టం లేనట్టుగానే వ్యవహరించారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్పుకుంటూ వచ్చాయి. సెలవులకు విదేశాలకు వెళ్తున్న చివరి నిమిషం ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ వాయిదాకు ఎస్ చెప్పడం అనూహ్యమే.

దీనికి వెనుక ఒక పెద్ద కథే ఉందంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. ముందు దిల్ రాజు తదితరులు పవన్ కళ్యాణ్ ని కలిసి ఒప్పించే ప్రయత్నాలు చేసినప్పటికీ అవేవి అంతగా ఫలించలేదు. నో అనే సమాధానమే ఇన్ డైరెక్ట్ గా వచ్చింది. తర్వాత రాజమౌళి రంగంలోకి దిగి త్రివిక్రమ్ తో పర్సనల్ గా మాట్లాడారు. ఆయన ద్వారా తప్ప ఇంకెవరిని కలిసినా ఉపయోగం లేదని తెలిసిన జక్కన్న దానికి అనుగుణంగానే చర్చలు జరిపారు. దీనికి తోడు సితార ప్రొడ్యూసరైన చినబాబుకు నిత్యం ప్రొడ్యూసర్స్ గిల్డ్ నుంచి విన్నపాలు వెళ్తూనే ఉన్నాయి. నాగ వంశీకి ఏ మాత్రం ఇష్టం లేకపోయినా పవన్ మాటను కాదనలేక ట్విట్టర్ లో సారీ చెప్పేదాకా వచ్చింది.

ఈ మొత్తం ఎపిసోడ్ లో కీలకంగా నిలిచింది త్రివిక్రమే. ఆయన ప్రాక్టికల్ గా ఆలోచించారు. భీమ్లా నాయక్ కు ఎంత హైప్ ఉన్నా రెండు పాన్ ఇండియా సినిమాల మధ్యలో రావడం ద్వారా రెవిన్యూ తగ్గించుకున్నట్టే. పైగా భీమ్లా ఒక తెలుగు భాషకే పరిమితం. కర్ణాటకలో మంచి బిజినెస్ అవుతుంది అంతే. కానీ ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ ల పరిస్థితి అలా కాదు. నేషన్ వైడ్ ఈ రెండే డిస్కషన్ లో ఉంటాయి. పైగా అజిత్ వలిమై కూడా ఉంది. సో శివరాత్రికి భీమ్లా నాయక్ రావడం వల్లే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. సోలోగా వస్తుంది కాబట్టి వకీల్ సాబ్ కన్నా ఎక్కువ కలెక్షన్లు రాబట్టుకోవచ్చు. సో ఎలా చూసుకున్నా ఇది చాలా తెలివైన నిర్ణయమే

Also Read : Radhe Shyam : ఊహించని కంటెంట్ తో సిద్ధమవుతున్న ప్రభాస్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి