iDreamPost

IND vs AFG: బ్రేకింగ్‌: ఇండియాతో టీ20 సిరీస్‌.. ఆఫ్ఘనిస్థాన్‌కు బిగ్‌ షాక్‌!

  • Published Jan 10, 2024 | 1:32 PMUpdated Jan 10, 2024 | 1:32 PM

IND vs AFG: రేపటి నుంచి ఇండియా వర్సెస్‌ ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభం కానుంది. అయితే.. ఈ సిరీస్‌ ఆరంభాన్ని ఒక్క రోజు ముందు ఆఫ్ఘాన్‌ టీమ్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య 11 నుంచి మూడు టీ20 సిరీస్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. టీ20 వరల్డ్‌ కప్‌ 2024కు ముందు ఆఫ్ఘాన్‌ లాంటి స్పిన్‌ బలం ఉన్న టీమ్‌తో తలపడటం టీమిండియా ఛాలెంజింగ్‌ స్వీకరిస్తుంది. పైగా ఆఫ్ఘాన్‌ను టీ20ల్లో అంత తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. అయితే.. ఇంత కీలక సిరీస్‌ ఆరంభానికి సరిగ్గా ఒక్క రోజు ముందు ఆఫ్ఘనిస్థాన్‌కు గట్టి షాక్‌ తగిలింది. టీమిండియాతో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు ఆ జట్టు స్టార్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ దూరమైనట్లు సమాచారం.

టీ20ల్లో ఆఫ్ఘనిస్థాన్‌ టీమ్‌కు రషీద్‌ ఖాన్‌ ఎంత ముఖ్యమైన బౌలరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతను టీమ్‌లో ఉంటే.. ప్రత్యర్థి జట్టు ఓ నాలుగు ఓవర్లను వదిలేసుకోవాల్సిందే. అంత కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడమే కాకుండా.. తన స్పిన్‌ మ్యాజిక్‌తో వికెట్లు కూడా తీస్తుంటాడు. అలాంటి బౌలర్ మొత్తం సిరీస్‌కు దూరం కావడంతో ఆ జట్టుకు ఆఫ్ఘాన్‌కు భారీ దెబ్బ. పైగా ఇండియా లాంటి పటిష్టమైన జట్టును ఎదుర్కొంటూ తమ ప్రధాన టీ20 బౌలర్‌ లేకుండా బరిలోకి దిగితే ఏ మేర పోటీ ఇస్తుందో చూడాలి. అయితే.. రషీద్‌ ఖాన్‌ ఎందుకు సిరీస్‌కు దూరం అయ్యాడనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరి రషీద్‌ ఖాన్‌ టీ20 సిరీస్‌కు దూరం కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి