iDreamPost

ఆఫ్ఘాన్‌లో తీవ్ర విషాదం..2 వేల మంది మృతి! రషీద్‌ ఖాన్‌ సంచలన నిర్ణయం

  • Published Oct 08, 2023 | 3:01 PMUpdated Oct 08, 2023 | 3:01 PM
  • Published Oct 08, 2023 | 3:01 PMUpdated Oct 08, 2023 | 3:01 PM
ఆఫ్ఘాన్‌లో తీవ్ర విషాదం..2 వేల మంది మృతి! రషీద్‌ ఖాన్‌ సంచలన నిర్ణయం

ప్రస్తుతం వన్డే వరల్డ్‌ కప్‌ 2023తో క్రికెటర్లంతా బిజీగా ఉన్నారు. వారి దృష్టి మొత్తం తాము ఆడబోయే మ్యాచ్‌లపై ఉంది. ఈ టోర్నీలో ఆఫ్ఘానిస్థాన్‌ సైతం ఇప్పటికే ఒక మ్యాచ్‌ ఆడేసింది. అయితే.. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆ దేశంలో భారీ భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని పశ్చిమ ప్రావిన్స్‌లోని హెరాత్, ఫరా, బాద్గీస్‌లలో సంభవించిన భూకంపంతో చాలా నష్టం జరిగింది. ఈ ప్రకృతి విలయానికి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 2 వేల మంది మృతి చెందినట్లు తెలుస్తుంది.

ఈ విషాదం గురించి తెలుసుకుని తీవ్ర భావోద్వేగానికి గురైన ఆఫ్ఘనిస్థాన్‌ స్టార్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌.. సంచలన నిర్ణయంతో తన గొప్ప మనసు చాటుకున్నాడు. ప్రస్తుతం తను ఆడుతున్న వన్డే వరల్డ్‌ కప్‌ ద్వారా వచ్చే మ్యాచ్‌ ఫీజ్‌ మొత్తం భూకంప బాధితులకు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించాడు. రషీద్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నా.. ఆఫ్ఘాన్‌లో చోటు చేసుకున్న విషాదం మాత్రం అనేకమంది చేత కన్నీళ్లు పెట్టిస్తుంది. కాగా.. భూకంప బాధితులను ఆదుకునేందుకు అవసరమైతే.. విరాళాలు కూడా సేకరిస్తానని రషీద్‌ వెల్లడించాడు. మరి రషీద్‌ తన వరల్డ్ కప్‌ మ్యాచ్‌ ఫీజ్‌ మొత్తం విరాళం ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: 2007 వరల్డ్‌ కప్‌ డిజాస్టర్‌పై ద్రవిడ్‌ ఎమోషనల్ రియాక్షన్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి