iDreamPost

Rana Daggubati : మా హీరోని తక్కువ చేశారని అభిమానుల ఫైర్

Rana Daggubati : మా హీరోని తక్కువ చేశారని అభిమానుల ఫైర్

నిన్న సోషల్ మీడియాలో దగ్గుబాటి ఫ్యాన్స్ మంచి ఫైర్ మీద కనిపించారు. థియేటర్ల కోసం పంపిన ఒక పోస్టర్ లో పవన్ కళ్యాణ్ రానాను కొట్టేసి కిందపడేసినట్టు అందులో ఉండటం వాళ్ళ ఆగ్రహానికి కారణం అయ్యింది. మల్టీ స్టారర్ అని చెప్పి టైటిల్ లో అన్యాయం చేసి చివరికి మా హీరోని ఇలా అవమానిస్తారా అంటూ మండిపడుతున్నారు. రానా ముఖం అందులో కనిపించకపోయినా స్పష్టంగా తనే అనే క్లారిటీ అందులో ఉంది. దీంతో జూనియర్ ఆర్టిస్ట్ తరహాలో ఇదేం చూపించడమని ప్రశ్నిస్తున్నారు. కొందరు ఏకంగా బాయ్ కాట్ భీమ్లా నాయక్ అంటూ నినాదాలు కూడా ఇచ్చేశారు. దీనికి సంబంధించి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి వివరణ రాలేదు

ఇది ఆన్ లైన్ లో వదిలిన అఫీషియల్ పోస్టర్ కాకపోయినా క్షణాల్లో వైరల్ కావడం గమనార్హం. భీమ్లా నాయక్ ఒరిజినల్ వెర్షన్ అయ్యప్పనుం కోశియుమ్ లో రెండు క్యారెక్టర్లు సమానంగా ఉంటాయి. పోస్టర్లలోనూ ఇద్దరూ కలిసి ఉన్నవే ఎక్కువ. పైగా రానా చేసిన డేనియల్ పాత్ర అక్కడ పృథ్విరాజ్ పోషించారు. ఆయనదే డామినేషన్. కానీ తెలుగుకు వచ్చేటప్పటికీ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా కీలకమైన మార్పులు చేశారు. అందులో భాగంగా ఇదంతా పూర్తిగా పవన్ వన్ మ్యాన్ షో అనేలా పబ్లిక్ లోకి ఈ సినిమా గురించి వెళ్లిపోయింది. ఈ అసంతృప్తే రానా అభిమానులను నిరసన వ్యక్తం చేసే దాకా తీసుకొచ్చింది.

సరే రానాకు న్యాయం జరిగిందా లేదా అనేది 25న థియేటర్లలో చూస్తే కానీ క్లారిటీ రాదు. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికే ఈ సినిమా ఫీవర్ తో మూవీ లవర్స్ ఊగిపోతున్నారు. తెలంగాణలో బుక్ మై షో రాద్ధాంతం వల్ల బుకింగ్స్ ట్రెండ్స్ బయటికి రావడం లేదు కానీ నేరుగా కౌంటర్ల వద్ద కొంటున్న అభిమానులు భారీ సంఖ్యలో ఉంటున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ ఈగో డ్రామాకు తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణ. మ్యూజిక్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయ్యింది. సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా రికార్డులు ఓ రేంజ్ లో బద్దలు అయిపోతాయి. రానా కూడా ఇలాంటి పవర్ ఫుల్ రోల్ చేసి చాలా కాలమయ్యింది

Also Read :  Etharkum Thunindhavan : సూర్య చేస్తున్న రిస్కు పెద్దదే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి