iDreamPost

కొలికపూడి శ్రీనివాస్ పై RGV ఫిర్యాదు

  • Published Dec 27, 2023 | 3:04 PMUpdated Dec 27, 2023 | 6:28 PM

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందిస్తూ.. కొలికపూడికి ఆర్జీవీ భారీ షాక్ ఇచ్చారు. ఆ వివరాలు..

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందిస్తూ.. కొలికపూడికి ఆర్జీవీ భారీ షాక్ ఇచ్చారు. ఆ వివరాలు..

  • Published Dec 27, 2023 | 3:04 PMUpdated Dec 27, 2023 | 6:28 PM
కొలికపూడి శ్రీనివాస్ పై RGV ఫిర్యాదు

గత కొన్ని రోజులుగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేరు నిత్యం వార్తల్లో కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద వర్మ వ్యూహం సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 29న ఇది ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే ఈ సినిమా విడుదలను నిలిపివేయాంటూ కొందరు కేసులు వేశారు. అంతేకాక.. మంగళవారం రోజున కొందరు దుండగులు ఆర్జీవీ ఆఫీసు వద్ద బీభత్సం సృష్టించారు. ఇదిలా ఉండగానే ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్.. ఆర్జీవీని ఉద్దేశిస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దానిపై స్పందిస్తూ.. వర్మ భారీ షాక్ ఇచ్చాడు. అతడిపై ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశాడు.

అసలు ఏమైందంటే.. నిన్న రాత్రి టీవీ డిబేట్లో మాట్లాడుతూ కొలికి పూడి శ్రీనివాసరావు వ్యూహం సినిమాపై, ఆర్జీవి పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాంగోపాల్ వర్మ తల నరికి ఎవరైనా తెస్తే వాళ్ళకి కోటి రూపాయలు ఇస్తానని బహిరంగంగా ప్రకటించాడు. ఛానల్‌లో ఓ చర్చా కార్యక్రమం నిర్వహించగా ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు కొలికపూడి శ్రీనివాస్. ఈ సందర్భంగా యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ రామ్ గోపాల్ వర్మను చర్చలోకి లాగిన శ్రీనివాస్.. ‘రామ్ గోపాల్ వర్మ తల నరికి తెస్తే కోటీ రూపాయలు ఇస్తా’ అంటూ సవాల్ చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఆర్జీవీ దీనిపై స్పందిస్తూ.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. కొలికపూడి మాట్లాడిన వీడియో క్లిప్ ను ఏపీ పోలీసులకు ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు వర్మ. అంతేకాక కొలికపూడి శ్రీనివాసరావు నన్ను చంపడానికి కోటి రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చాడు అని రాసుకొచ్చాడు. ఆ తర్వాత మరో ట్వీట్ చేస్తూ.. కొలికపూడి శ్రీనివాస్, సదరు యాంకర్, టీవీ చానల్ ఓనర్ మీద ఫిర్యాదు చేయడం కోసం ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు నేను విజయవాడ డీజీపీ ఆఫీస్ కు వస్తాను అని పేర్కొన్నాడు. చెప్పినట్లే డీజీపీకి వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డీజీపీ సానుకూలంగా స్పందించారని, తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి