iDreamPost

Ram Charan: షారుఖ్ ఖాన్ లాంటి వాళ్లను పక్కకు నెట్టి మరీ.. బాలీవుడ్ బెస్ట్​గా రామ్ చరణ్!

  • Author singhj Published - 07:58 PM, Sat - 9 December 23

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ దూకుడు మామూలుగా లేదు. ఏకంగా బాలీవుడ్​ బాద్​షా షారుఖ్​ ఖాన్​ లాంటి వాళ్లను కూడా చెర్రీ కోసం పక్కన పెట్టేశారు.

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ దూకుడు మామూలుగా లేదు. ఏకంగా బాలీవుడ్​ బాద్​షా షారుఖ్​ ఖాన్​ లాంటి వాళ్లను కూడా చెర్రీ కోసం పక్కన పెట్టేశారు.

  • Author singhj Published - 07:58 PM, Sat - 9 December 23
Ram Charan: షారుఖ్ ఖాన్ లాంటి వాళ్లను పక్కకు నెట్టి మరీ.. బాలీవుడ్ బెస్ట్​గా రామ్ చరణ్!

ఏ గౌరవాన్ని అయినా గౌరవప్రదంగా అందుకోవాలి. అందుకు తగిన గౌరవాన్ని వ్యక్తిత్వం, ప్రతిభ ద్వారా నిలుపుకోవాలి. కొన్ని అవార్డులు రావాలంటే అంత సమున్నతమైన స్థాయినీ, రేంజ్ ని చాలా పర్ఫెక్ట్​గా నిలబెట్టుకోవాలి. ఇవన్నీ అందరి గురించి రాయగలిగే మాటలు కావు. కానీ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి రాయొచ్చనిపించే సందర్భమూ, క్షణమూ ఇది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో ప్రపంచ సినిమానే ఆకట్టుకొని, హాలీవుడ్ మేకర్స్ కూడా వెంటపడినా, ఇండియన్ సినిమాలు పూర్తి చేసి వస్తానని సగౌరవంగా చెప్పిన గ్రేట్​నెస్ రామ్ చరణ్ కే సొంతం. మహామహా అనుకున్న వాళ్లంతా ఉన్న బాలీవుడ్ లో బెస్ట్ ఆఫ్ ది బాలీవుడ్ ఆఫ్ 2023గా ‘పాప్ గోల్డెన్ అవార్డ్ ఆఫ్ 2023’ లాంటి అరుదైన అవార్డును అందుకొని అభిమానులతో కేరింతలు కొట్టించారు రామ్ చరణ్.

‘పాప్ గోల్డెన్ అవార్డ్ ఆఫ్ 2023’ కోసం పోటీలో సాదాసీదా వాళ్లు లేరు. షారుఖ్ ఖాన్, దీపికా పదుకోణ్, ఆదా శర్మ, రాశీఖన్నా ఇంకా ఎందరో ఉన్నారు. అయినా రామ్ చరణ్ మాత్రమే ఇంత ప్రతిష్టాత్మక అవార్డు పోటీలో విజేతగా నెగ్గుకు రాగలిగారు. తెలుగువాళ్లు సినిమాలతోనే ప్రపంచమంతా జెండా ఎగురవేస్తుంటే.. చెర్రీ మాత్రం ఇలాంటి అసమానమైన, చాలా క్రేజీ అవార్డుతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ది కింగ్ ఈజ్ కింగ్ అని, గ్లోబల్ హార్ట్ త్రోబ్ అని రామ్ చరణ్​ను అభిమానులు సోషల్ మీడియాలో అభినందనల్లో ముంచెత్తుతున్నారు. ఇది నిజంగా ఆయన ఫ్యాన్స్​కే కాదు.. యావత్తు తెలుగు సినీ పరిశ్రమకు, అటు బాలీవుడ్​కూ గర్వకారణమే.

ఒకనాడు బాంబే ఫిల్మ్ ఫెస్టివల్ కి వెళ్లి, అక్కడ తెలుగుకు సంబంధించిన ఒక్క మహానటుడి ఫోటో కూడా లేదని ఆవేదనకి గురయ్యారు మెగాస్టార్ చిరంజీవి. అలాంటి చిరు ‘ప్రతిబంధ్’ సినిమాతో బాలీవుడ్ కి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు సాక్షాత్తూ తన కొడుకే ప్రపంచ సినీ శిఖరం మీద నిలబడినప్పుడు మెగాహార్ట్ ఎలాంటి ఉద్విగ్నభరితమైన ఆనందానికి గురై ఉంటుందో ఊహించడం కష్టం కానే కాదు. పైగా ఆయన ఆనందం కన్నా కూడా ప్రపంచం యావత్తులో విస్తరించిన రామ్ చరణ్ అభిమాన ప్రవాహపు సంచలనమే వెయ్యింతలుగా ఉంది. మరి.. షారుఖ్​ లాంటి వారిని కాదని చరణ్​ను ఈ అవార్డు వరించడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: మీరు ఏడిపించండి.. మేము ఏడ్చి హిట్ ఇస్తాం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి