iDreamPost

Uppal Stadium: వీడియో: ఉప్పల్‌లో ఇండియా-ఇంగ్లండ్ ఫస్ట్ టెస్ట్! స్టేడియం న్యూ లుక్ అదిరింది!

  • Published Jan 24, 2024 | 5:42 PMUpdated Jan 24, 2024 | 5:42 PM

Uppal, IND vs ENG: ఇండియా -ఇంగ్లండ్‌ మధ్య తొలి టెస్ట్‌ మ్యాచ్‌ కోసం హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం ముస్తాబు అయింది. అయితే.. స్టేడియం గతం కంటే భిన్నంగా కనిపిస్తోంది. ఆ మార్పేంటో ఇప్పుడు చూద్దాం..

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య గురువారం నుంచి ఐదు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో తొలి టెస్ట్‌ జరగనుంది. ఇప్పటికే తొలి టెస్ట్‌కు సంబంధించిన టిక్కెట్లు భారీగా అమ్ముడయ్యాయి. ఈ మ్యాచ్‌ కోసం హైదరాబాద్‌ నగరవాసులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా, వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ 2025 పాయింట్ల పట్టికలో మరింత మెరుగుపడాలని భారత్‌-ఇంగ్లండ్‌ ఇరు జట్లు భావిస్తున్నాయి. అందుకోసం ఈ ఐదు టెస్టుల సిరీస్‌ను చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. దీంతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ కూడా ఈ సిరీస్‌పై ఇంట్రెస్ట్‌ చూసిస్తున్నారు. మ్యాచ్‌ను ప్రత్యేకంగా గ్రౌండ్‌లోనే చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

అందుకే ఇప్పటికే ఆన్‌లైన్‌ టిక్కెట్లు చాలా మంది కొనుగోలు చేశారు. అలాగే బుధవారం రిటైల్‌ టిక్కెట్లను విక్రయించగా.. క్రికెట్‌ అభిమానులు టిక్కెట్ల కోసం పొటెత్తారు. అయితే.. మ్యాచ్‌ను చూసేందుకు వచ్చే ప్రేక్షకుల సరైన సౌకర్యాలు కల్పించేందుకు హెచ్‌సీఏ(హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌) అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా భారత్‌-ఇంగ్లండ్‌ టెస్ట్‌ మ్యాచ్‌కు ముందు గ్రౌండ్‌లో రెనోవేషన్‌ పనులు చేపట్టిన హెచ్‌సీఏ.. వాటిని మ్యాచ్‌ ప్రారంభాని కంటే ముందే పూర్తిచేసి.. స్టేడియాన్ని ఎంతో సుందరంగా తీర్చిద్దింది.

కాగా, ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌ 2023 కోసం నిర్వహించిన వామప్‌ మ్యాచ్‌లు కొన్ని హైదరాబాద్‌లో జరిగాయి. అందులో భాగంగా పాకిస్థాన్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌ కూడా జరిగింది. ఈ మ్యాచ్‌ల సమయంలో స్టేడియంలో సౌకర్యాలు సరిగా లేవని, కనీసం కూర్చేందుకు సీట్లు కూడా సరిగా లేవని విమర్శలు వచ్చాయి. కానీ, ఇప్పుడు చూస్తే స్టేడియం లుక్‌ మొత్తం కంప్లీట్‌గా మారిపోయింది. తాజాగా స్టేడియానికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి కిందున్న ఆ వీడియో చూసి.. స్డేడియం న్యూ లుక్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి