iDreamPost

చనిపోయాడు అని అంత్యక్రియలు కూడా చేసేశారు.. కానీ, 13 రోజుల తర్వాత..

Madhya Pradesh: సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల చిత్ర విచిత్రమైన వార్తలు, వీడియోలు చూసే అవకాశం దక్కుతుంది. కొన్ని నమ్మశక్యం కాని వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.

Madhya Pradesh: సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల చిత్ర విచిత్రమైన వార్తలు, వీడియోలు చూసే అవకాశం దక్కుతుంది. కొన్ని నమ్మశక్యం కాని వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.

చనిపోయాడు అని అంత్యక్రియలు కూడా చేసేశారు.. కానీ, 13 రోజుల తర్వాత..

సమాజంలో నిత్యం మన చుట్టూ ఎన్నో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొన్ని కడుపుబ్బా నవ్వించేలా ఉంటే.. మరికొన్ని ఆలోచింపజే విధంగా, ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంటున్నాయి. చనిపోయాడు అనుకున్న వ్యక్తి అంత్యక్రియలు జరిపే సమయంలో లేచి కూర్చున్న సంఘటనలు తరుచూ జరుగుతుంటాయి. చనిపోయాడు అనుకున్న వ్యక్తి కొన్ని రోజుల తర్వాత కుటుంబ సభ్యుల ముందు ప్రత్యక్షమైతే వాళ్ల పరిస్తితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.. అలాంటి సంఘటనలు తరుచూ జరుగుతుంటాయి. రాజస్థాన్ లో అలాంటి ఘటనే ఒకటి జరిగింది. వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్ లో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ సవాయ్ మాధోపూర్ సమీపంలో ఓ ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో చనిపోయి, గాయపడిన వారిని గుర్తించాలని సోషల్ మీడియాలో ప్రకటన వేశారు. లచ్చోడా గ్రామానికి చెందిన ఒక కుటుంబం గాయపడిన వ్యక్తి సురేంద్ర శర్మగా గుర్తించి అతన్ని జైపూర్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని సురేంద్రగా కుటుంబీకులు ప్రాథమికంగా గుర్తించడం జరిగిందని పోలీస్ స్టేషన్ ఇంచార్జి లాల్ బహదూర్ తెలిపారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. పదమూడో రోజు కర్మకాండలకు కుటుంబం సిద్దమవుతుండగా వారికి ఓ ఫోన్ వచ్చింది. మొదట మాట్లాడుతున్న వ్యక్తి జోక్ చేస్తున్నారని భావించారు. ఆ తర్వాత వీడియో కాల్ చూసి షాక్ తిన్నారు. చనిపోయాడు అనుకున్న సురేంద్ర సజీవంగా ఉన్నాడు. వెంటనే ఇంటికి రమ్మని పిలిచారు.

ప్రమాదంలో తమ కొడుకు ఆనవాళ్లు ఉన్నాయని.. అలాగే అతని పేరు మీద ఫుడ్ బిల్ అతని వద్ద ఉండటంతో తన కొడుకు అనుకొని వేరే వ్యక్తికి అంత్యక్రియలు చేశామని సురేంద్ర తల్లి కృష్ణ దేవి వివరించారు. తమ కొడుకు ఫోన్ లో మాట్లాడినపుడు మొదట నమ్మలేకపోయామని.. వీడియో కాల్ చూసిన తర్వాత షాక్ తిన్నామని అన్నారు. జై పూర్ లో ఓ క్లాత్ కంపెనీలో పనిచేస్తున్న సురేంద్ర ఫోన్ రిపేర్ వల్ల రెండు నెలలుగా కుటుంబ సభ్యులతో కాంటాక్ట్ లేకుండా పోయిందని అన్నారు. ఇప్పుడు సురేంద్ర సజీవంగా ఉండటం వల్ల తదుపరి విచారణ కోసం కుటుంబ సభ్యులను పోలీసులు పిలిచి విచారణ చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి