iDreamPost

గ్యాంగ్ రే*ప్ బాధితురాల్ని.. కోర్టులోనే దుస్తులు విప్పమన్న మేజిస్ట్రేట్

న్యాయ దేవత తలవంచుకునే, సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. అత్యాచార బాధితురాలిని ఓ మేజిస్ట్రేట్ బహిరంగా ఆమెను ప్రశ్నించిన తీరు ఇప్పుడు సంచలనం రేపుతోంది.

న్యాయ దేవత తలవంచుకునే, సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. అత్యాచార బాధితురాలిని ఓ మేజిస్ట్రేట్ బహిరంగా ఆమెను ప్రశ్నించిన తీరు ఇప్పుడు సంచలనం రేపుతోంది.

గ్యాంగ్ రే*ప్ బాధితురాల్ని.. కోర్టులోనే దుస్తులు విప్పమన్న మేజిస్ట్రేట్

దేశంలో ఆడ పిల్లలపై అత్యాచారాలు ఆగడం లేదు. ఎన్ని చట్టాలు, సెక్షన్లు తీసుకు వచ్చినప్పటికీ కామాంధులు.. ఆడపిల్లలు/ మహిళలపై పశువుల్లా పడి తమ శారీరక వాంఛను తీర్చుకుంటున్నారు. చిన్న పిల్లల నుండి కాటికి కాళ్లు చాపే ముదసలి వరకు ఎవ్వర్నీ వదిలిపెట్టడం లేదు. తమపై జరిగిన దాడి గురించి బాధితురాలు పోలీసులకు విన్న విస్తే..కొంత మంది ఖాకీలు డబ్బులకు లోబడిపోయి ఆమెదే తప్పు అన్నట్లుగా మార్చేస్తున్నారు. చివరకు ఆమెనే దోషి చేస్తున్నారు. దీంతో కొంత మంది కోర్టులను ఆశ్రయిస్తున్నారు. తాము నలుగురిలో నవ్వులు పాలు అవుతామని తెలిసి కూడా న్యాయం కోసం న్యాయ స్థానాల మెట్లు ఎక్కుతున్నారు. మరీ అక్కడే ఆమెకు అనూహ్యమైన ప్రశ్న ఎదురైతే.. ఇంక ఎవరికి చెప్పుకుంటుంది రేప్ బాధితురాలు.

సామూహిక అత్యాచారానికి గురైన ఓ యువతి పట్ల న్యాయ వ్యవస్థ తలదించుకునేలా వ్యవహరించాడో మేజిస్ట్రేట్. తనపై జరిగిన అత్యాచారం గురించి నోరు విప్పి చెప్పుకుంటున్న బాధితురాలికే బిగ్ షాక్ ఇచ్చాడు. కోర్టులో అందరి ముందు దుస్తులు విప్పి.. దెబ్బలు చూపించాలంటూ కోరడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ దారుణాతి దారుణమైన ఘటన రాజస్తాన్‌లోని కరౌలి జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు హిండౌన్ కోర్టు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ పై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. వివరాల్లోకి వెళితే.. మార్చి 19న ఓ దళిత యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఆమెను అత్యాచారం చేయగా.. ప్రాణాలతో బయటపడిన సదరు బాధితురాలు.. తన వాంగూల్మం ఇచ్చేందుకు కోర్టును ఆశ్రయించింది.

Magistrate undressed in court

ఆమె స్టేట్ మెంట్ ఇచ్చాక.. ‘నీ ఒంటిపై గాయాలు చూడాలి.. దుస్తులు తీసి చూపించు’ అని మేజిస్ట్రేట్ కోరాడు. దీంతో విస్తుపోయిన మహిళ నిరాకరించింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదులో వివరాలు ఇలా ఉన్నాయి. ‘కోర్టులో నా స్టేట్ మెంట్ తీసుకోవడానికి మేజిస్ట్రేట్ నన్ను పిలిచారు. ఆ రోజు ఏం జరిగిందో మెత్తం చెప్పాను. నేను బయటకు వెళ్లడం ప్రారంభించాను. అప్పుడు నన్ను తిరిగి పిలిచాడు. వెంటనే నా బట్టలు విప్పు అన్నారు. ఎందుకు విప్పాలి అని ప్రశ్నించగా.. నీ శరీరంపై గాయం గుర్తులు చూడాలి అన్నారు. నేను దుస్తులు విప్పలేదు’ అని పేర్కొంది. ఈ ఘటన మార్చి 30వ తేదీ జరగ్గా.. ఆమె ఫిర్యాదుతో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్సీ-ఎస్టీ) సెల్ మీనా తెలిపారు. ఈ కేసును రాజస్తాన్ హైకోర్టు విజిలెన్స్ రిజిస్ట్రార్ అజయ్ సింగ్జ జాట్ నేతృత్వంలోని బృందానికి కేసు బ దిలీ అయ్యింది. ఆ బృందం విచారణ జరుపుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి