iDreamPost

వేడుకల వేళ నెహ్రు జూలో విషాదం.. ఏనుగు దాడిలో!

వేడుకల వేళ నెహ్రు జూలో విషాదం.. ఏనుగు దాడిలో!

తెలంగాణలో సందర్శించ దగ్గ పర్యాటక ప్రాంతంగా నిలుస్తుంది నెహ్రు జులాజికల్ పార్క్. వీకెండ్సే, సెలవులే కాకుండా ఇతర రోజుల్లో కూడా వందలాది మంది వీక్షకులు ఈ జూను సందర్శిస్తుంటారు. మొత్తం 380 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఈ జూ. ఇందులో సుమారు 1500 జాతుల జంతువులు, పక్షులు ఉన్నాయి. తెల్ల నెమళ్లు, ఆఫ్రికన్ ఏనుగులు, చిరుత పులులు, చింపాంజీలు, ఖడ్గ మృగాలు వంటి వివిధ జాతులను చూడవచ్చు. చిన్న, పెద్దలు వీటిని చూసేందుకు వస్తుంటారు. ఈ జూ లోపల ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది లయన్ సఫారీ. ఇనుముతో నిండిన వ్యానులో వీక్షకులను.. సవారీకి తీసుకెళతారు. ఈ మొత్తం జూను చూడాలంటే సుమారు 6 నుండి 7 గంటలు పడుతుంది. కాగా, ఇప్పుడు ఈ జూలో విషాదం నెలకొంది.

జూలో ఓ ఏనుగు భీభత్సం సృష్టించింది. ఏనుగు చేసిన దాడిలో సంరక్షకుడు ప్రాణాలు కోల్పోయాడు. శనివారం సాయంత్రం ఏనుగుల సఫారీలో విధుల్లో ఉన్న షాబాజ్ అనే మావటిపై ఏనుగు హఠాత్తుగా దాడి చేసింది. సాధారణంగా ఏనుగుల సఫారీలో ఐదాగురు మావటిలు విధుల్లో ఉంటారు. శనివారం జూపార్క్ 60 సంవత్సరాల వేడుక సందర్భంగా కొంత మంది అక్కడి విందులో పాల్లొన్నారు. ఆ సమయంలో షాబాజ్ ఒక్కరే విధుల్లో ఉన్నారు. ఆ సమయంలోనే ఏనుగు అతడిపైకి దూసుకుంటూ వచ్చి నేలకేసి కొట్టింది. ఈ పరిణామాన్ని అతడు ఊహించేలోపు ఇదంతా జరిగింది. తీవ్ర గాయాలైన అతడిని.. సిబ్బంది డీఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి