iDreamPost

Radhe Shyam 3 Days Collections : టార్గెట్ ఇంకా చాలా దూరం డార్లింగ్

Radhe Shyam 3 Days Collections : టార్గెట్ ఇంకా చాలా దూరం డార్లింగ్

‘భారీ అంచనాల మధ్య విడుదలై మిక్స్డ్ టాక్ తో మొదలైన రాధే శ్యామ్ పరుగు మొదటి వీకెండ్ ని పూర్తి చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు నమోదు కాగా మిగిలిన చోట్ల మాత్రం కనీసం బ్రేక్ ఈవెన్ దరిదాపుల్లోకి వెళ్లడం కూడా కష్టమనేలా ఉంది. ఇవాళ నుంచి డ్రాప్ ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. అనూహ్యంగా అసలే అంచనాలు లేకుండా వచ్చిన ది కాశ్మీర్ ఫైల్స్ నార్త్ లో రాధే శ్యామ్ ని దెబ్బ కొట్టడం ఎవరూ ఊహించనిది. పైగా దానికి ఈ రోజు నుంచి స్క్రీన్లు పెరుగుతున్నాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వీక్ డేస్ లో సహజంగానే డ్రాప్స్ ఉంటాయి. రాధే శ్యామ్ కు ఇవి ఏ మోతాదులో ఉండనున్నాయనేది కీలకంగా మారనుంది.

ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు రాధే శ్యామ్ ప్రపంచవ్యాప్తంగా 72 కోట్ల షేర్ కు దగ్గరగా వెళ్ళింది. నిజానికి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి ఉంటే కనక ఈజీగా వంద కోట్ల మార్కు సాధ్యమయ్యేది. కేరళ తమిళనాడులో పరిస్థితి మరీ దారుణంగా ఉండటంతో అక్కడ డిజాస్టర్ ఫిక్స్ అయిపోయింది. సాహో తరహాలో ఉత్తరాదిలో ఏదో మేజిక్ జరుగుతుందని ఆశించిన నిర్మాతలకు నిరాశ తప్పలేదు. చాలా చోట్ల డెఫిసిట్లు స్టార్ట్ అయ్యాయి. ఇంకో పది రోజుల్లో ఆర్ఆర్ఆర్ వస్తుండటంతో ఇంకే అద్భుతాలు ఆశించలేం. ఈ వారం మరీ గొప్పగా చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడం రాధే శ్యామ్ కు ఊరట కలిగించే అంశం

నైజామ్ – 22 కోట్ల 30 లక్షలు
సీడెడ్ – 6 కోట్ల 60 లక్షలు
ఉత్తరాంధ్ర – 4 కోట్ల 25 లక్షలు
ఈస్ట్ గోదావరి – 3 కోట్ల 87 లక్షలు
వెస్ట్ గోదావరి – 2 కోట్ల 98 లక్షలు
గుంటూరు – 4 కోట్ల 8 లక్షలు
కృష్ణ – 2 కోట్ల 34 లక్షలు
నెల్లూరు – 1 కోటి 90 లక్షలు

ఏపి/తెలంగాణ మూడు రోజుల షేర్ – 48 కోట్ల 32 లక్షలు

కర్ణాటక – 3 కోట్ల 95 లక్షలు
తమిళనాడు – 60 లక్షలు
కేరళ – 13 లక్షలు
నార్త్ – 6 కోట్ల 80 లక్షలు
రెస్ట్ అఫ్ ఇండియా – 1 కోటి 40 లక్షలు
ఓవర్సీస్ – 10 కోట్ల 55 లక్షలు

ప్రపంచవ్యాప్తంగా 3 డేస్ కలెక్షన్ – 71 కోట్ల 75 లక్షలు (సుమారుగా)

దీని ప్రకారం చూసుకుంటే రాధే శ్యామ్ ఇంకా 130 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంటుంది. మిగిలిన వెర్షన్ల మీద ఆశలు వదిలేసుకోవాలి కాబట్టి తెలుగు నుంచి ఇంత మొత్తం రావడం అసాధ్యమే. కానీ ప్రభాస్ ఇమేజ్ ఎంతమేరకు కాపాడుకుంటూ వస్తుందనేది ఆసక్తికరం. లాభాల మాట అటుంచితే బ్రేక్ ఈవెన్ చేరుకోవడమే గగనమైపోతుంది. ఇంకో మూడు రోజులు పరిస్థితి గమనించి అప్పుడో అంచనాకు రావొచ్చు. ఇంకో వీకెండ్ వస్తుంది కాబట్టి అప్పుడైనా ఏపి తెలంగాణలోనే వీలైనంత మొత్తం రాబట్టాలి. 18న వచ్చే అక్షయ్ కుమార్ బచ్చన్ పాండేతో నార్త్ లో రాధే శ్యామ్ చాప్టర్ కు దాదాపుగా శుభం కార్డు పడినట్టే.

Also Read : The Kashmir Files Report : ది కాశ్మీర్ ఫైల్స్ రిపోర్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి