iDreamPost

Priyanka Chopra: భారతీయ సినిమాలపై ప్రియాంక చీప్ కామెంట్స్.. ప్రైవేట్ పార్ట్స్​ గురించే ఉంటాయంటూ..!

  • Author singhj Published - 05:24 PM, Wed - 5 July 23
  • Author singhj Published - 05:24 PM, Wed - 5 July 23
Priyanka Chopra: భారతీయ సినిమాలపై ప్రియాంక చీప్ కామెంట్స్.. ప్రైవేట్ పార్ట్స్​ గురించే ఉంటాయంటూ..!

టాలెంట్ ఉంటే ఎంత ఎత్తుకు అయినా ఎదగొచ్చని నిరూపించిన హీరోయిన్లలో ప్రియాంక చోప్రా ఒకరు. సౌత్ మూవీస్​తో తన ఫిలిం జర్నీని ఆమె మొదలుపెట్టారు. ఆ తర్వాత బాలీవుడ్​లో అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్​ రేంజ్​కు చేరుకున్నారు. ఆమె అందానికి, యాక్టింగ్ టాలెంట్​కు హిందీ మూవీ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్​తో పాటు అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోల సరసన ఎన్నో హిట్ చిత్రాల్లో ఆమె యాక్ట్ చేశారు. ప్రియాంక తమ సినిమాలో ఉంటే హిట్ గ్యారెంటీ అని హీరోలు నమ్మేవారు. అయితే పెళ్లి తర్వాత బాలీవుడ్​కు ఆమె దూరమయ్యారు.

నిక్ జోనాస్​ను మ్యారేజ్ చేసుకున్న తర్వాత బాలీవుడ్ కంటే హాలీవుడ్​ మీదే ప్రియాంక ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ పలు టెలివిజన్ షోలు, వెబ్ సిరీస్​లతో పాటు సినిమాల్లోనూ నటించే ఛాన్స్​ను పిగ్గీ చాప్స్ దక్కించుకున్నారు. ‘సిటాడెల్’ సిరీస్​తో హాలీవుడ్​లో మంచి పాపులారిటీ దక్కించుకున్నారామె. వరుసగా అక్కడి ప్రాజెక్టుల్లో నటిస్తూ గ్లోబల్ స్టార్​ ఇమేజ్​ను సొంతం చేసుకున్నారు. వరల్డ్ వైడ్​గా తన ఫ్యాన్ బేస్​ను పెంచుకుంటున్నారు ప్రియాంక. అయితే ఈ అందాల రాశికి సంబంధించిన ఒక పాత వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో వల్ల ప్రియాంకపై భారీగా విమర్శలు వస్తున్నాయి.

యూఎస్​లోని లాస్ ఏంజిల్స్​లో 2016లో జరిగిన ఎమ్మీ అవార్డ్స్ ఈవెంట్​కు ప్రియాంక అటెండ్ అయ్యారు. అక్కడ ఒక యాంకర్​ భారతీయ సినిమాలపై తన అభిప్రాయం చెప్పాలని ప్రియాంకను అడిగారు. యాంకర్ అడిగిన క్వశ్చన్​కు తడుముకోకుండా వెంటనే ఇండియన్ సినిమాలన్నీ ఆడవాళ్ల ప్రైవేట్ పార్ట్స్ గురించే ఉంటాయనే అర్థం వచ్చేలా ఆమె వ్యాఖ్యలు చేశారు. ఒకరకంగా ఎక్స్​పోజింగ్ తప్ప మన సినిమాల్లో ఏమీ ఉండదనే అర్థం వచ్చేలా చెప్పుకొచ్చారు ప్రియాంక. అది పాత వీడియోనే అయినప్పటికీ ఇప్పుడు వైరల్ అవుతోంది. దీన్ని చూసిన మూవీ లవర్స్ పిగ్గీ చాప్స్​పై విమర్శలకు దిగుతున్నారు. మరి.. భారతీయ సినిమాలపై ప్రియాంక చేసిన కామెంట్స్​ మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి