iDreamPost

Bhamakalapam 2: భామాకలాపం 2 లో ప్రధాన పాత్రగా కోడి!

  • Published Feb 15, 2024 | 4:17 PMUpdated Feb 15, 2024 | 4:17 PM

ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం భామాకలపం 2. ఈ సినిమా రేపు ఆహాలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ లతో మూవీ టీమ్ బిజీబిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్య్వూలో ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను హీరోయిన్ ప్రియమణి షేర్ చేసుకున్నారు.

ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం భామాకలపం 2. ఈ సినిమా రేపు ఆహాలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ లతో మూవీ టీమ్ బిజీబిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్య్వూలో ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను హీరోయిన్ ప్రియమణి షేర్ చేసుకున్నారు.

  • Published Feb 15, 2024 | 4:17 PMUpdated Feb 15, 2024 | 4:17 PM
Bhamakalapam 2: భామాకలాపం 2 లో ప్రధాన పాత్రగా కోడి!

ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన భామాకలాపం 2 రేపు ఆహా వీడియోలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. కాగా నిర్మాతలు ఈ చిత్రాన్ని ఒక పెద్ద సినిమా లాగా ప్రమోట్ చేసారు. అందుకే ఈ క్రైమ్ థ్రిల్లర్ కోసం మంచి బజ్ ఉంది. భామా కలాపం మొదటి భాగం మంచి విజయం సాధించింది. సీక్వెల్ లో మరిన్ని ఆసక్తికరమైన అంశాలు ఉంటాయని చిత్ర బృందం తెలిపారు. ఇక ఈ సినిమా గురించి చిత్ర బృందం గట్టిగానే ప్రచారం చేస్తోంది.

ఇక ఈ సీక్వెల్ గురించి ఆసక్తికరమైన అంశాన్ని నటి ప్రియమణి వెల్లడించారు. ఒక ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ.. పార్ట్ 1లో గుడ్డు కీలకమైన అంశం అయితే, సీక్వెల్‌కు కోడి ప్రాథమిక నేపథ్యంగా ఉంటుందని చెప్పారు. కథ మొత్తం ఈ కోడి చుట్టూ తిరుగుతుందని, ఆ కోడి కథకు తన పాత్రను కలిపి ఎలా అల్లుకున్నారనేది ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని ప్రియమణి చెప్పారు. ట్రైలర్ చూస్తే మొదటి భాగం లానే ప్రియమణి ఒక పెద్ద క్రైమ్ లో ఇరుకున్నట్టు తెలుస్తోంది. పాత విషయాలు అన్నీ మరిచిపోయి కొత్త హోటల్ పెట్టుకున్న అనుపమ జీవితంలో అనుకోకుండా జరిగిన కొన్ని అనుకోని సంఘటనల నేపథ్యంగా భామాకలాపం 2 తెరకెక్కింది.

ఆహా స్టూడియోస్‌తో కలిసి డ్రీమ్‌ ఫార్మర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో ప్రియమణి ప్రధాన పాత్రలో నటించారు, సీరత్ కపూర్, శరణ్య, రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రలలో కనిపించారు. మంచి ఫ్యామిలీ డ్రామాతో పాటు ప్రేక్షకులను థ్రిల్ చేసే యాక్షన్ డోస్ కూడా సినిమాలో ఉంటుందని చిత్ర బృందం తెలిపారు. అభిమన్యు తడిమేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించారు. పైన చెప్పుకున్న విధంగా ట్రైలర్ తో ఈ సినిమా పట్ల మంచి బజ్ క్రియేట్ చేశారు. ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం సమకూర్చగా, దీపక్ యరగెర ఫోటోగ్రఫీ అందించారు. ‘భామాకలాపం 2’ ఫిబ్రవరి 16 అంటే రేపటి నుండి ఆహాలో అందుబాటులోకి రానుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి