iDreamPost

CM జగన్ విషయంలో ప్రశాంత్ కిషోర్ మిస్సైన లాజిక్ అదే!

Prashant Kishore: ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ .. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఓ లాజిక్ మిస్సయ్యారంట.

Prashant Kishore: ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ .. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఓ లాజిక్ మిస్సయ్యారంట.

CM జగన్ విషయంలో ప్రశాంత్ కిషోర్ మిస్సైన లాజిక్ అదే!

ఏదైనా ఒక అంశం గురించి మనం మాట్లాడే ముందు..దానిపై పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయాలి. అలా చేసే సమయంలో కూడా లాజిక్ అనేది మిస్సవ్వకుండా చూడాలి. అలా కానీ పక్షంలో మనం చేసే వ్యాఖ్యలు..నలుగురిలో నవ్వులు పాలయ్యేలా చేస్తాయి. ఇది అన్ని రంగాల వారికి వర్తిస్తోంది. ముఖ్యంగా రాజకీయాల్లో చాలా జాగ్రత్తగా, ఆలోచించి మాట్లాడాలి. లాజిక్ మిస్సైతే.. అదే పాయింట్ తో ప్రశ్నల బాణాలు  తిరిగి వస్తుంటాయి. తాజాగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విషయంలో అదే జరిగింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ప్రశాంత్ కిషోర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. అది కూడా తెలంగాణకు వచ్చిన ఆయన ఏపీ రాజకీయల గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఓటమి పాలవుతుండంటూ వ్యాఖ్యలు చేశాడు. చదువుకున్న వాళ్లు ఉద్యోగాలు కోరుకుంటారు కాని ఉచితాలు కాదంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఓట్లు పడవని ప్రశాంత్ కిషోర్ అన్నారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యంతో పాటు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ మరో లగడపాటి రాజగోపాల్ గా మారబోతున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. ప్రశాంత్ కిషోర్ ఓ లాజిక్ ఎలా మిస్సయ్యాడనే టాక్ వినిపిస్తోంది.

ఇక ప్రశాంత్ కిషోర్ మాటలను గమనిస్తే.. సంక్షేమ పథకాలతో ఓట్లు రావని, యువతకు ఉద్యోగాలు ఇస్తేనే మేలని అన్నారు. అలా చూసుకున్నట్లు అయితే తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎంతో అభివృద్ధి చేసింది. మరి.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎలా ఓడిపోయిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు సంక్షేమ గురించి ఆలోచిస్తారని, అందుకే సిటీల్లో బీఆర్ఎస్ వచ్చిన..రూరల్ ఏరియాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అలానే రైతు బంధువు, దళిత బంధువు వంటి పథకాలను చాలా తక్కువ మందికే అందించారనే  అభిప్రాయాలు జనాల్లో ఉన్నాయి.

దీంతో గ్రామీణ ప్రాంతాల్లోనే పేద, మధ్యతరగతి ప్రజల్లో సీఎం కేసీఆర్ పై వ్యతిరేకత వచ్చిందని  రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి..అలా చూసినట్లు అయితే ఏపీలో జగన్ సర్కార్ సంక్షేమ పథకాలను అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్నారు. ఎక్కడా అసమానతలు లేకుండా సంక్షేమ పథకాలను అందరికీ అందిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇక్కడ సీఎం జగన్ ఎలా గెలవడని, అభివృద్దే చూసి ఉంటే తెలంగాణలో కేసీఆర్ మరోసారి గెలిచి ఉండాల్సింది కదా, ఈ లాజిక్ ఎలా మిస్సైవు ప్రశాంత్ కిషోర్ అంటూ  పలువురు రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు ఎవరి వైపు ఉంటే.. ఆ నాయకుడే విజయం సాధిస్తారు. ఆ విషయంలో సీఎం జగన్ కి చాలా అనుకూలంగా ఉంది. మరి.. తెలంగాణ, ఏపీ విషయంలో ఇలాంటి లాజిక్ మిస్సైన ప్రశాంత్ కిషోర్,  ఏ స్వార్థంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పలువురు మండిపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి