iDreamPost

ప్రభుదేవా ప్రాధాన్యం ఒక్కదానికే

ప్రభుదేవా ప్రాధాన్యం ఒక్కదానికే

భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క సినిమా ప్రేమికుడికి పరిచయమున్నపేరు ప్రభుదేవా. నృత్యదర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి ఆపై హీరోగా స్టార్ గా దర్శకుడిగా ఎదిగి అన్నిటిలోనూ విజయం సాధించడం అరుదైన విషయం. ఇతని నాన్న సుందరం మాస్టర్ ఎంత గొప్ప డాన్స్ డైరెక్టర్ అయినా కొడుకులా ఆల్ రౌండర్ సాహసం చేయలేకపోయారు. చిరంజీవితో చేసిన గ్యాంగ్ లీడర్ తో వచ్చిన గుర్తింపుతో మొదలు ప్రేమికుడుతో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాక ప్రభుదేవా ఇమేజ్ పీక్స్ కు వెళ్లిపోయింది. లారెన్స్ వచ్చేవరకు తమిళం తెలుగులో ఒకే ఒక్క ఆప్షన్ తన పేరు మాత్రమే ఉండేది. అంతగా చరిత్ర సృష్టించిన ప్రస్థానం తనది.

దర్శకుడిగానూ ప్రభుదేవా సాధించిన విజయాలు చిన్నవి కావు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ కొట్టడం తనకే చెల్లింది. ప్రభాస్ తో పౌర్ణమి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయినా తమిళంలో తీసిన పోకిరి రీమేక్ సూపర్ సక్సెస్ కొట్టింది. చిరంజీవి శంకర్ దాదా జిందాబాద్ తీవ్రంగా నిరాశపరచగా సల్మాన్ ఖాన్ పిలిచి ఇచ్చిన పోకిరి హిందీ వెర్షన్ వాంటెడ్ బాలీవుడ్ జెండా పాతేలా చేసింది. అక్షయ్ కుమార్ రౌడీ రాథోడ్(విక్రమార్కుడు రీమేక్)కమర్షియల్ గా పెద్ద రేంజ్ అందుకోగా ఆర్ రాజ్ కుమార్, యాక్షన్ జాక్సన్, సింగ్ ఈజ్ బ్లింగ్, దబాంగ్ 3 ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. వీటికి ముందు చేసిన తమిళ సినిమాలు అంతే

ఇక ఇటీవలే వచ్చిన రాధే సంగతి సరేసరి. సల్మాన్ కెరీర్ లోనే వరస్ట్ మూవీగా క్రిటిక్స్ మాత్రమే కాదు సామాన్య ప్రేక్షకులు సైతం దుమ్మెత్తి పోశారు. టీవీ ప్రీమియర్ లోనూ చాలా దారుణమైన రేటింగ్ తెచ్చుకుని కండల వీరుడి ఇమేజ్ కి తూట్లు పొడిచింది. ఈ నేపథ్యంలో డైరెక్షన్ సరిగా నిర్వహించలేకపోతున్నానని గుర్తించిన ప్రభుదేవా కేవలం నటుడిగా మాత్రమే కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు చెన్నై టాక్. అధికారికంగా ప్రకటించలేదు కానీ దర్శకుడిగా వచ్చిన ఆఫర్లకు వరసగా నో చెబుతున్నారట. ఇకపై హీరోగా లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే కంటిన్యూ అవ్వాలని ఫిక్స్ అయ్యారట. లేట్ అయినా మంచి నిర్ణయమే

Also Read: రవితేజ ఇంతకీ ఎప్పుడు వస్తున్నట్టు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి