iDreamPost

My Dear Bootham Movie Review మై డియర్ భూతం రిపోర్ట్

My Dear Bootham Movie Review మై డియర్ భూతం రిపోర్ట్

ఒకప్పుడు ప్రభుదేవా డబ్బింగ్ సినిమా వస్తోందంటే తెలుగులోనూ బోలెడు సందడి ఉండేది. హిట్ టాక్ వస్తే స్టార్ హీరోలకు ధీటుగా వసూళ్లు వచ్చేవి. డెబ్యూ మూవీ ప్రేమికుడుతోనే ఈ ఫీట్ సాధించిన అరుదైన ఘనత తనదే. తర్వాత ఆ స్థాయి బ్లాక్ బస్టర్ దక్కకపోయినా డాన్సింగ్ మాస్టర్ ఫాలోయింగ్ కు ఎలాంటి ఇబ్బంది రాలేదు. క్రమంగా దర్శకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయిన ప్రభుదేవా లేటెస్ట్ మూవీ మై డియర్ భూతం నిన్న థియేటర్లలో అడుగు పెట్టింది. రామ్ ది వారియర్ లాంటి పోటీ ఉన్నప్పటికీ సాయిపల్లవి గార్గితో పాటు రంగంలోకి దిగింది. ముఖ్యంగా చిన్నపిల్లలను టార్గెట్ చేసుకుని వచ్చిన ఈ చైల్డ్ ఎంటర్ టైనర్ ఎలా ఉందో రిపోర్ట్ లో చూసేద్దాం.

భూతాలుండే లోకానికి రాజు కర్ణముఖి(ప్రభుదేవా). దురదృష్టశాత్తు జరిగిన ఓ సంఘటన వల్ల ఓ ముని శపించడంతో భూలోకంలో రాయిలా మారిపోతాడు. దాన్నుంచి విముక్తి దక్కాలంటే ఓ నిబంధన పెడతాడు. దానికోసమే ఎదురు చూస్తుంటాడు కర్ణముఖి. నత్తితో బాధ పడుతూ స్కూల్లో ఎగతాళిని ఎదురుకుంటున్న శ్రీనివాస్(అశ్వంత్)వల్ల అతనికి మోక్షం కలుగుతుంది. దీంతో అతను బయటికి వస్తాడు. అయితే తిరిగి భూతాల లోకానికి వెళ్లాలంటే ఆ శీను చేయాల్సిన పని మరొకటి ఉంటుంది. కానీ నత్తి వల్ల అది కష్టమవుతుంది. దీంతో ఆ బాధ్యతను కర్ణముఖి తీసుకుంటాడు. ఆ తర్వాత ఈ ఇద్దరి బంధం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో తెరమీద చూడాలి

కథేమీ కొత్తగా అనిపించదు. చాలా సార్లు చూసిందే. కార్టూన్లు, బాలల సినిమాలు చూసే వాళ్లకు లైన్ రొటీనే అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఓ మోస్తరుగా పర్వాలేదు అనిపించినా దర్శకుడు ఎస్ రాఘవన్ రెండో సగంలో చేతులెత్తేశాడు. అవసరం లేని సాగతీత చాలానే ఉంది.ఈజీ గా ఊహించేలా కథనం సాగడం ప్రధాన లోపం. పిల్లలకు కొంతమేరకు టైం పాస్ అనిపించినా ఇంత అవుట్ డేటెడ్ లైన్ తో పబ్జి జెనరేషన్ కిడ్స్ ని మెప్పించడం చాలా కష్టం. జస్ట్ ఓకే అనిపిస్తుంది. ప్రభుదేవాతో సమానంగా స్క్రీన్ స్పేస్ దక్కించుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ అశ్వంత్ బాగా నటించాడు. ఓటిటిలో చూస్తే సరిపోయే ఇలాంటి కంటెంట్ ని థియేటర్లో పెద్దలు భరించడం కష్టమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి