iDreamPost

మంచు విష్ణు పాన్ ఇండియా మూవీలో ప్రభాస్?

  • Published Sep 10, 2023 | 11:38 AMUpdated Sep 10, 2023 | 11:38 AM
  • Published Sep 10, 2023 | 11:38 AMUpdated Sep 10, 2023 | 11:38 AM
మంచు విష్ణు పాన్ ఇండియా మూవీలో ప్రభాస్?


తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతోమంది నట వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మనోజ్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. విలన్, హీరో, క్యారెక్టర్ పాత్రల్లో మోహన్ బాబు తనదైన అద్భుతమైన నటనతో దాదాపు వందకు పైగా చిత్రాల్లో నటించిన ప్రేక్షకాధరణ పొందారు. మోహన్ బాబు డైలాగ్స్ ఇప్పటికీ థియేటర్లో ప్రేక్షకుల చప్పట్లు కొడుతూనే ఉంటారు.. కానీ ఆయన తనయులు మాత్రం ఆ రేంజ్ స్టార్ డమ్ ని కంటిన్యూ చేయలేకపోయారని ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్ప చిత్రాన్ని తేరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో సెన్సేషనల్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మంచు విష్ణు ఎప్పటి నుంచి చెబుతున్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్ప తెరపైకి తీసుకు వచ్చేందుకు సన్నామాలు మొదలు పెట్టినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. గత ఏడాది ‘జిన్నా’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన మంచు విష్ణు చాలా గ్యాప్ తీసుకున్నారు. ఏ సినిమా కూడా అనౌన్స్ చేయలేదు. ఈ క్రమంలోనే ఎలాంటి హడావుడి లేకుండా పాన్ ఇండియా మూవీని మొదలు పెట్టారు విష్ణు. ‘కన్నప్ప’ అనే టైటిల్ తో మూవీని తెరకెక్కిస్తున్నారు.. ఈ చిత్రాన్ని మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. అవా ఎంటర్ టైన్ మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టీరీ పతాకంపై రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వనిపిస్తుంది.

ఈ మూవీకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మంచు విష్ణు నటించబోతున్న ‘కన్నప్ప’ మూవీలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారని వైరల్ వార్తల సారాంశం. గతంలో పూరి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘బుజ్జిగాడు’ మూవీలో మోహన్ బాబు కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. మొదటి నుంచి కృష్ణంరాజు, మోహన్ బాబుకి మంచి అనుబంధం ఉంది. అలాగే మోహన్ బాబు అంటే డాల్లింగ్ ప్రభాస్ కి చాలా గౌరవం. ఏ సినీ ఫంక్షన్లో కనిపించినా వీరిద్దరూ చాలా క్లోజ్ గా మాట్లాడుకుంటారు.

మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా మూవీలో ప్రభాస్ కనిపిస్తే అంచనాలు భారీగా పెరిగిపోతాయని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో అన్నది తెలియరాలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు చిత్ర యూనిట్ కన్ఫామ్ చేయలేదు. బాలీవుడ్ బుల్లితెరపై మహాభారత్ సీరీస్ తో తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. మంచు విష్ణు సరసన బాలీవుడ్ బ్యూటీ నుపూర్ సనన్ నటిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి