iDreamPost

దొంగతనం కేసులో మాజీ ముఖ్యమంత్రికి షాకిచ్చిన అధికారులు

తిండికి గతి లేని వ్యక్తులు ఉద్యోగం లేక తప్పని సరి పరిస్థితుల్లో దొంగతనాలకు పాల్పడుతుంటారు. కానీ ఓ ప్రజా ప్రతినిధి హోదాలో ఉన్న వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి చోరీ చేస్తే. వినడానికి వింతగా అనిపించినా.. అతడికి షాక్ ఇచ్చింది ప్రస్తుత ప్రభుత్వం.

తిండికి గతి లేని వ్యక్తులు ఉద్యోగం లేక తప్పని సరి పరిస్థితుల్లో దొంగతనాలకు పాల్పడుతుంటారు. కానీ ఓ ప్రజా ప్రతినిధి హోదాలో ఉన్న వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి చోరీ చేస్తే. వినడానికి వింతగా అనిపించినా.. అతడికి షాక్ ఇచ్చింది ప్రస్తుత ప్రభుత్వం.

దొంగతనం కేసులో మాజీ ముఖ్యమంత్రికి షాకిచ్చిన అధికారులు

దొరికితే దొంగలు లేకుంటే దొరలు.. అన్న సామెత నిజం అనిపించకమానదు ఈ సంఘటన చూస్తుంటే. పేదోడు దొంగతనం చేశాడంటే ఇల్లు గడవకో, పని దొరక్కో, భార్యాబిడ్డల్ని పస్తులుంచడం ఇష్టం లేక చోరీకి పాల్పడ్డాడు అనుకోవచ్చు. కానీ ప్రజా ప్రతినిధిగా కొనసాగుతూ.. ఒక రాష్ట్రాన్ని ఏలిన సీఎం సారూ.. కన్నెం వెస్తే వినడానికి వింత అనిపించొచ్చు కానీ.. ఇదేం పనిరా బాబూ అనకుండా ఉండలేం. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. ప్రభుత్వ సొమ్మును కాజేసి వార్తల్లో నిలిచారు. అతడు చేసిన నిర్వాకం సోషల్ మీడియాకు ఎక్కడంతో వైరల్ అయ్యింది. దీంతో అధికారులు చర్యలకు దిగక తప్పలేదు. జరిమానా కట్టాలంటూ నోటీసులు జారీ చేశారు. ఇంతకు ఆ నేత ఎవరంటే హెచ్ డి కుమారస్వామి.

మాజీ ప్రధాని, జనతాదళ్ సెక్యులర్ అధినేత హెచ్ డి దేవేగౌడ కుమారుడు, మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి చౌర్యానికి పాల్పడ్డారు. దీపావళి సందర్భంగా బెంగళూరులోని తన నివాసాన్ని అలంకరించేందుకు ఓ స్థంభం నుండి అక్రమంగా కరెంట్ దొంగిలించారు. దీనిని గమనించిన కొందరు.. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలతో రెచ్చిపోయారు. ఈ వీడియోస్ వైరల్ కావడంతో బెస్కాం(బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లయ్ కంపెనీ లిమిటెడ్) అధికారుల దృష్టికి వెళ్లింది. అక్కడికి వెళ్లి చూడగా.. నిజమేనని తేలడంతో.. బెస్కాం ఏఈఈ ప్రశాంత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో జయనగర పోలీసులు చెన్నపట్న ఎమ్మెల్యే కుమార స్వామిపై కేసు నమోదు చేశారు. వారం రోజుల్లోగా 68 వేల రూపాయాల జరిమాన కట్టాలంటూ నోటీసులు జారీ అయ్యాయి.

ఈ నోటీసుతో ఖంగుతిన్న కుమార స్వామి పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లు తయారయ్యింది. దీంతో వివరణ ఇచ్చుకున్నారు. ఈ సంఘటన జరిగే సమయంలో తాను ఇంట్లో లేనని, ఇంటిని అలకరించే బాధ్యతను ఓ ప్రైవేట్ డెకొరేటర్ కు అప్పగించగా.. టెస్టింగ్ కోసం బయట నుండి విద్యుత్ వినియోగించారని చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసి ఇంట్లో మీటర్ నుండి విద్యుత్ వాడుకోవాలని సూచించినట్లు తెలిపారు. ఇది అక్రమమని భావిస్తే అధికారులు.. జరిమానా విధిస్తే కట్టేందుకు సిద్ధమని చెప్పారు. ఇప్పుడు ఇది పెను దుమారం రేపుతోంది. బెంగళూరులోని జేడీఎస్ కార్యాలయం ఎదుట కుమారస్వామి ఎలక్రిసిటీ దొంగ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఇది కాంగ్రెస్ పనే అని జెడీఎస్ పేర్కొంది. అయితే పోలీసులు ఆ పోస్టర్లను తొలగించారు. తెలంగాణాలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలోకి అధికార పార్టీ కాంగ్రెస్‌కువ్యతిరేకంగా మాట్లాడిన తర్వాత ఆయనపై కేసు నమోదు కావడం గమనార్హం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి