iDreamPost

ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే నెలకు 20 వేలు వస్తాయి.. సొంతింటి కల నెరవేరుతుంది!

నెల నెలా 20 వేలు వస్తాయా? పైగా సొంతింటి కల నెరవేరుతుందా? ఇంతకే ఏ పథకం అది. ప్రతి నెలా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలా? అసలు ఎలా వస్తాయి ప్రతి నెలా 20 వేలు?

నెల నెలా 20 వేలు వస్తాయా? పైగా సొంతింటి కల నెరవేరుతుందా? ఇంతకే ఏ పథకం అది. ప్రతి నెలా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలా? అసలు ఎలా వస్తాయి ప్రతి నెలా 20 వేలు?

ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే నెలకు 20 వేలు వస్తాయి.. సొంతింటి కల నెరవేరుతుంది!

చాలా మంది పొలం అమ్మేసి ఆ డబ్బుతో వేరే చోట స్థలం కొనడమో లేక స్థలం ఉంటే ఇల్లు కట్టేయడమో చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల అది డెడ్ ఇన్వెస్ట్ మెంట్ అవుతుందే తప్ప ప్రయోజనం ఉండదు. అదే డబ్బుని ఇన్వెస్ట్ చేయగా వచ్చే డబ్బుతోనే ఏమైనా చేయాలి. వడ్డీకి తిప్పగా వచ్చే డబ్బుతో చిట్టీ వేసి స్థలం కొనుక్కోవడమో లేదంటే హోమ్ లోన్ తీసుకుని నెలకి ఇంత ఈఎంఐ కట్టడమో చేస్తే.. అమ్మిన పొలం డబ్బులు అసలు అలానే ఉంటాయి. దానికొచ్చే వడ్డీ డబ్బు బ్యాంక్ ఈఎంఐ కట్టుకుంటుంది. తెలివైనవాళ్లు ఇలానే ఆలోచిస్తారు. లేదంటే ఏ ప్రభుత్వ పథకంలోనో పెట్టుబడి పెట్టి నెలకు వచ్చే వడ్డీతో స్థలం కొనుక్కోవడం, ఇల్లు కట్టుకోవడమో చేస్తే ఆ అమ్మిన పొలానికి ఒక సార్థకత ఉంటుంది. 

ఉదాహరణకు మీరు మీ పొలాన్ని 30 లక్షలకు అమ్మేశారు అనుకుందాం. ఆ 30 లక్షలతో ఒకేసారి స్థలం కొనేస్తే మంచిదే. స్థలం విలువ పెరుగుతుంది. కానీ అదే స్థలాన్ని.. 30 లక్షలు వడ్డీకి ఇచ్చి ఆ వడ్డీ డబ్బుతో కొంటే అసలు 30 లక్షలు అలానే ఉండిపోతాయి కదా. 30 లక్షలని బయట వ్యక్తులకు రూపాయి వడ్డీకి ఇచ్చినా గానీ నెలకు 30 వేలు వస్తాయి. ఈ డబ్బుతో చిట్టీ వేసుకుని.. చిట్టీ పాటతో స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకోవచ్చు. చిట్టీ వేసుకుంటే చేతులెత్తేస్తారు అని అనుకుంటే కనుక ఆ నెల నెలా వచ్చే వడ్డీని హోమ్ లోన్ తీసుకుని ఈఎంఐగా కట్టుకోవచ్చు. దీని వల్ల మీ జీతం తక్కువైనా గానీ ఈఎంఐ భారం లేకుండానే సొంతింటి కల నెరవేరుతుంది. 

30 ఏళ్ల కాలపరిమితితో 8 శాతం వార్షిక వడ్డీకి 30 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే నెలకు 20 వేలు ఈఎంఐ పడుతుంది. 20 వేలు ఈఎంఐ పోయినా గానీ 10 వేలు మిగులుతాయి. అయితే మీ వడ్డీ, అసలు తిరిగి వస్తాయా, లేదా అన్నది.. వడ్డీకిచ్చే వ్యక్తుల నిజాయితీ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే చాలా మంది ప్రాపర్టీస్ ని తనకా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. అప్పు తీర్చకపోతే ఆ ప్రాపర్టీ అమ్మేసి వాళ్ళ డబ్బు తీసుకుని మిగతా డబ్బు ఇచ్చేస్తారు. డెడ్ ఇన్వెస్ట్ మెంట్ చేయకుండా పొలం డబ్బు పోకుండా దాని వడ్డీతో సొంతింటి కల నెరవేర్చుకోవడం ఒక పద్ధతి. రెండో పద్ధతి.. ఈ ప్రభుత్వ పథకంలో ఇన్వెస్ట్ చేయడం. రిస్క్ లేని పని ఇదైతే. 

బయట వ్యక్తులకు వడ్డీకి ఇస్తే చేతులెత్తేస్తారు.. ప్రభుత్వ పథకం అయితేనే మంచిది అనుకుంటే కనుక దానికి కూడా ఒక బెటర్ ఆప్షన్ ఉంది. ఏంటంటే.. పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం. ఈ పథకంలో పెట్టుబడి పెడితే నెల నెలా వడ్డీ వస్తుంది. ఈ పథకంలో ఒక వ్యక్తి కనీసం వెయ్యి రూపాయల నుంచి 9 లక్షల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు. జాయింట్ అకౌంట్ తీసుకుంటే గరిష్టంగా 15 లక్షల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు. 15 లక్షలు పెట్టుబడి పెడితే 7.4 శాతం వార్షిక వడ్డీ వస్తుంది. అంటే నెలకు రూ. 9250 వస్తాయి. తక్కువే అయినా రిస్క్ అనేది ఉండదు.

ప్రభుత్వ పథకం కాబట్టి మీ డబ్బులకు గ్యారంటీ ఉంటుంది. ఇలా అయితే నెలకు 9250 యే వస్తున్నాయి కదా అంటే.. మిగతా 15 లక్షలు ఉంటాయిగా. వాటిని తల్లిదండ్రుల పేరు మీద జాయింట్ ఎకౌంట్ తీసుకుని పెట్టుబడి పెడితే నెలకు మరో 9250 రూపాయలు వస్తాయి. మొత్తం మీద 30 లక్షల మీద నెలకు 18,500 వస్తాయి. ఈ డబ్బుని సొంతింటి కల కోసం వినియోగించుకోవచ్చు. లేదా హోమ్ లోన్ తీసుకుని ఈఎంఐ కింద కట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఇన్వెస్ట్ మెంట్ అనేది డెడ్ అవ్వదు. పొలం అమ్మిన డబ్బుతో ఇల్లు కొనడం కంటే దాన్ని ఎందులో అయినా పెట్టుబడి పెట్టి ఆ వచ్చిన డబ్బుతో కొనడం వల్ల ఇంటి విలువ పెరగడమే కాకుండా అసలు ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి