iDreamPost

మంజుమ్మల్ బాయ్స్ మూవీ టీమ్ కి ఇళయరాజా నోటీసులు.. ఎందుకంటే?

  • Published May 23, 2024 | 12:08 PMUpdated May 23, 2024 | 12:11 PM

ఇటీవలే మలయాళంలో బ్లాక్‌ బస్టర్‌ మూవీగా నిలిచిన మంజుమ్మల్‌ బాయ్స్‌ భారీగా కలెక్షన్స్‌ ను రాబట్టిన విషయం తెలిసిందే. కానీ, తాజాగా ఈ మూవీ ఇప్పుడు పెద్ద చిక్కుల్లో ఇరుక్కుంది. ఇంతకి ఏం జరిగిందంటే..?

ఇటీవలే మలయాళంలో బ్లాక్‌ బస్టర్‌ మూవీగా నిలిచిన మంజుమ్మల్‌ బాయ్స్‌ భారీగా కలెక్షన్స్‌ ను రాబట్టిన విషయం తెలిసిందే. కానీ, తాజాగా ఈ మూవీ ఇప్పుడు పెద్ద చిక్కుల్లో ఇరుక్కుంది. ఇంతకి ఏం జరిగిందంటే..?

  • Published May 23, 2024 | 12:08 PMUpdated May 23, 2024 | 12:11 PM
మంజుమ్మల్ బాయ్స్ మూవీ టీమ్ కి ఇళయరాజా నోటీసులు.. ఎందుకంటే?

మలయాళం బ్లాక్‌ బస్టర్‌ మూవీ.. ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’. ఇటీవలే ఈ మూవీ  బాక్సాఫీస్ వద్ద  భారీ విజయాన్ని అందుకుని భారీగా కలెక్షన్స్‌ ను రాబట్టింది. అయితే రియల్‌ స్టోరి ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీ మలయాళంలో ఫిబ్రవరి 22న విడుదలై.. దాదాపు  రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక మలయాళంలో భారీ కలెక్షన్స్‌ ను రాబట్టిన ఈ మూవీ తెలుగులో కూడా ఏప్రిల్‌ 6వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయిన  ఈ సినిమా ఇప్పుడు పెద్ద చిక్కుల్లో పడింది. ఇంతకి ఏం జరిగిందంటే..

ఇటీవలే మలయాళం, తెలుగులో  బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సినిమా మంజుమ్మల్ బాయ్స్. అయితే ఈ సినిమా ఇప్పుడు పెద్ద చిక్కుల్లో పడింది. కాగా, మంజుమ్మల్ బాయ్స్ చిత్రబృందానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయారాజా లీగల్ నోటీసులు పంపించారు. ఎందుకంటే.. ఈ సినిమా క్లైమాక్స్‏లో 1991లో కమల్ హాసన్ నటించిన ‘గుణ’ చిత్రంలోని ‘కన్మణి అన్బోడు’ పాటను ఉపయోగించారు. అయితే గుణ చిత్రానికి ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్ పనిచేశారు. దీంతో ఈ సాంగ్ ఇప్పుడు తెగ ఫేమస్ అయ్యింది. అంతేకాకుండా.. సోషల్ మీడియలో కూడా  ఈ సాంగ్ ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతుంది. కానీ, అనుమతి లేకుండా ఈ పాటను వాడుకున్నందుకు చిత్రనిర్మాణ సంస్థకు ఇళయారాజా తరపు లాయర్ శరవణన్ నోటీసులు పంపించారు.

ఇక కాపీరైట్ చట్టం ప్రకారం.. ఈ పాటకు సంబంధించిన పూర్తి హక్కులు ఇళయరాజాకు చెందనవి. అలాంటప్పుడు తమ సినిమాలో ఈ పాటను ఉపయోగించాలంటే హక్కులు పొందాలంటే వినియోగానికి తగిన పరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. అలా కాకుంటే.. కాపీరైట్ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లుగా చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, ఇటీవలే ఇళయరాజా సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ నటిస్తున్న కూలి సినిమా టీజర్ లో కూడా తన సంగీతాన్ని అనుమతి లేకుండా వాడినట్లు సన్ పిక్చర్స్ సంస్థకు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ మంజుమ్మల్ బాయ్స్ సినిమా కు నోటీసులు పంపించడంతో నెట్టింట హాట్‌ టాపిక్‌ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్‌ ఏమిటంటే.. గుణ’ సినిమా ఆడియో రైట్స్‌ని సొంతం చేసుకున్న మ్యూజిక్ కంపెనీ నుంచి ఇదివరకే మంజుమ్మల్ బాయ్స్ మేకర్స్ అనుమతి తీసుకున్నారు. అంతేకాకుండా.. మ్యూజిక్ రైట్స్ ను కూడా కొనుగోలు చేశారు. అలానే సినిమా ప్రారంభంలో ఇళయరాజా, కమల్ హాసన్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ క్రెడిట్స్ కూడా ఇచ్చారు. ఇక ఇన్ని చేసినా ఇళయరాజా సినిమా రిలీజై ఇన్ని రోజులకు  ఇలా నోటీసులు పంపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి, అనుమతి లేకుండా మంజుమ్మల్ బాయ్స్ సినిమాలో తన సంగీతాన్ని ఉపాయోగించినందుకు చిత్రనిర్మాణకి ఇళయరాజా నోటిసులు పంపించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి