iDreamPost

విషాదం.. ట్వీట్ చేసిన కాసేపటికే ప్రముఖ యాంకర్ శివాని కన్నుమూత!

  • Author ajaykrishna Updated - 08:04 AM, Tue - 11 July 23
  • Author ajaykrishna Updated - 08:04 AM, Tue - 11 July 23
విషాదం.. ట్వీట్ చేసిన కాసేపటికే ప్రముఖ యాంకర్ శివాని కన్నుమూత!

మృత్యువు ఎప్పుడు ఎవరిని ఎలా వెంటాడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు ఎవరు చావు నుండి తప్పించుకోలేరు. కొన్నాళ్ళుగా ఇండస్ట్రీలో సెలబ్రిటీల వరుస మరణాలు అభిమానులను, ప్రేక్షకులను కలచివేస్తున్నాయి. సెలబ్రిటీల మరణాలకు అనారోగ్య సమస్యలు, గుండెపోటు, వేరే ఇతరత్రా కారణాలు ఏవైనా అయ్యుండొచ్చు. కానీ.. ఆకస్మికంగా ఊహించని మరణాలు బాధాకరం. ఈ క్రమంలో ఇప్పుడు మరో పాపులర్ యాంకర్ ఆకస్మికంగా కన్నుమూసిన వార్త అందరిని షాక్ కి గురి చేస్తోంది. దేశవ్యాప్తంగా పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరించిన యాంకర్ శివాని సేన్ మరణించారు.

రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ శతాబ్ది ఉత్సవాలకు శివాని వ్యాఖ్యతగా వ్యవహరించి కార్యక్రమం విజయవంతం కావడంలో ముఖ్యపాత్ర పోషించింది. అటువంటిది ఎవరు ఊహించని విధంగా సోమవారం కన్నుమూశారు. అయితే.. శివాని మరణానికి కారణం.. ఎపిలెప్టిక్ అటాక్ అనే బ్రెయిన్ సంబంధిత సమస్య అని తెలుస్తోంది. ఆదివారం వరకు సోషల్ మీడియాలో సైతం యాక్టీవ్ గా ఉన్న శివాని.. అదేరోజు ట్విట్టర్ లో ఓ ట్వీట్ కూడా రీట్వీట్ చేశారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఎపిలెప్టిక్ అటాక్ తో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ప్రస్తుతం శివాని మరణవార్త విని ఖంగుతిన్న అభిమానులు, ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. శివాని సేన్ కి ప్రస్తుతం ఫ్యామిలీతో పాటు ఓ బాబు కూడా ఉన్నారు. ఇక 2005 తొలిసారి హోస్ట్ గా కెరీర్ ప్రారంభించిన శివాని.. ఆ తర్వాత వరుస అవకాశాలు రావడంతో.. మన దేశంతో పాటు ఇతర దేశాలలో సైతం ఎన్నో ప్రెస్టిజియస్ ఈవెంట్స్ ని హోస్ట్ చేశారు. అందులోనూ కార్పొరేట్ ఈవెంట్స్, కాన్ఫరెన్సులు, మీడియా ప్రోగ్రాంస్, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రముఖుల ఇళ్లలో పెళ్లిళ్లు, ఫ్యాషన్ షోలు.. ఇలా కార్యక్రమం ఏదైనా తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ.. మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా కన్నుమూయడం అనేది బాధాకరమైన విషయం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి