iDreamPost

Movie Collections : జోష్ తగ్గుతున్న టికెట్ కౌంటర్లు

Movie Collections : జోష్ తగ్గుతున్న టికెట్ కౌంటర్లు

సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి. కానీ థియేటర్ల దగ్గర భారీ కళ కనిపించడం లేదు. లాక్ డౌన్ అయ్యాక హాళ్లు తెరిచిన తర్వాత చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చిన సినిమాలు కొన్నే. ఎస్ఆర్ కళ్యాణమండపం, లవ్ స్టోరీ, రాజరాజ చోర, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లు మాత్రమే నిర్మాతలకు లాభాలు ఇచ్చాయి. మిగిలినవన్నీ అంతో ఇంతో నష్టాన్ని తెచ్చినవే. మొన్న శుక్రవారం వచ్చిన పెద్దన్న, మంచి రోజులు వచ్చాయి, ఎనిమి ఏవీ కూడా యునానిమస్ గా జనాన్ని ఆకట్టుకోలేదు. బ్రేక్ ఈవెన్ చేరుకోవడం కూడా అనుమానమే. కేవలం హైప్ మీద బిజినెస్ జరుపుకున్న ఈ సినిమాల్లో కంటెంట్ వీక్ గా ఉండటమే దీనికి కారణం. ఈ కథ ఒక్క వారానిది కాదు.

అంతకు ముందు వారం వరుడు కావలెను మంచి అంచనాల మధ్య తుస్సుమనిపించింది. టార్గెట్ షేర్ కి సగం దూరంలోనే ఆగి ఎదురీదుతోంది. అదే రోజు నానా హడావిడి చేసుకుంటూ వచ్చిన రొమాంటిక్ ఆరంభ శూరత్వానికి పరిమితమయ్యింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఒకపక్క తాము థియేటర్లకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నా సరే వాళ్లకు తగ్గ సినిమాలు రాక వీక్ డేస్ లో హాళ్లు సగం కూడా నిండక భోరుమంటున్నాయి. నగరాల్లో వారాంతాలలో మంచి సందడి కనిపిస్తోంది కానీ జిల్లా కేంద్రాలు పట్టణాల్లో పరిస్థితి అంతంత మాత్రమే. ఒక్క బ్లాక్ బస్టర్ వస్తే చాలు సీన్ మొత్తం మారిపోతుంది.

ఎప్పటికప్పుడు అలాంటిది వస్తుందని డిస్ట్రిబ్యూటర్లు ఎదురు చూడటమే కానీ అంత జోష్ ఇంకా కనిపించడం లేదు. సూర్యవంశీ, ఇటర్నల్స్ లాంటి ఇతర బాషల సినిమాలకు కూడా మల్టీ ప్లెక్సుల్లో తప్ప బయట ఆదరణ తప్ప సోసోనే. ఈ పరిస్థితి ఎప్పటి దాకా ఉంటుందో అంతు చిక్కడం లేదు. ఇపుడు 12కి రాబోతున్న వాటిలో మొదటి వారమే చూసి తీరాలనిపించేవి కనిపించడం లేదు. డిసెంబర్ లో పుష్పనో అఖండనో వచ్చే దాకా ఈ సీన్ రిపీట్ అవుతూనే ఉంటుంది. మధ్యలో ఒకటి రెండు సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే బాక్సాఫీస్ దగ్గర సందడి ఉంటుంది. లేదంటే నవంబర్ కూడా డ్రైగానే గడిచిపోతుంది

Also Read : Raja Vikramarka : చిన్న హీరోల మధ్య పెద్ద యుద్ధం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి