iDreamPost

గీతాంజలి మృతి పట్ల పొలిటికల్ ఎనలిస్ట్ KS ప్రసాద్ ఎమోషనల్..

Tenali Geetanjali- KS Prasad: తెనాలి మహిళ గీతాంజలి ఆత్మహత్య ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ ఘటనపై ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ ఎమోషనల్ అయ్యారు.

Tenali Geetanjali- KS Prasad: తెనాలి మహిళ గీతాంజలి ఆత్మహత్య ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ ఘటనపై ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ ఎమోషనల్ అయ్యారు.

గీతాంజలి మృతి పట్ల పొలిటికల్ ఎనలిస్ట్ KS ప్రసాద్ ఎమోషనల్..

ఒక ఆడ కూతురు తనకు జరిగిన మేలు గురించి.. తనకు జరిగిన సంక్షేమం గురించి పట్టరాని ఆనందంతో తన మనసులోని మాటలు చెప్పుకుంటే ఆమె అంతు చూసేదాకా నిద్రపోలేదు. ఇళ్ల పట్టా దక్కింది, అమ్మ ఒడి వస్తోంది, అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి అంటూ ఎంతో సంతోషించింది. కానీ, చివరకు ఆ కుటుంబానికి ఆ సంతోషమే లేకుండా చేశారు. సూటిపోటి మాటలు, సోషల్ మీడియా ట్రోలింగ్ తో ఆమె ఆత్మహత్య చేసుకునేలా ఉసిగొలిపారు. ఇప్పుడు ఇద్దరు చిన్నారులు తల్లిలేని వాళ్లు అయిపోయారు. ఈ ఘటనపై ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ కూడా ఎమోషనల్ అయ్యారు.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో గీతాంజలి అనే గృహిణి ఆత్మహత్య సంచలనం రేపుతోంది. తనకు దక్కిన సంక్షేమం గురించి చెప్తే తన ప్రాణం తీసుకునేలా చేశారు. ఈ అంశంపై ఎంతో మంది ప్రముఖులు, మేధావులు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు స్పందించారు. ఆ కుంటుంబానికి అండగా నిలబడ్డారు. ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ కూడా గీతాంజలి మృతి పట్ల స్పందిస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. సాధారణంగా కేఎస్ ప్రసాద్ అనగానే భీకరమైన కంఠం, అంశం ఏదైనా నిప్పులు చెరురుగుతూ కనిపిస్తారు. తాను అనుకున్న విషయాన్ని నిక్కచ్చిగా చెప్తుంటారు. అలాంటి వ్యక్తి మొదటిసారి ఎమోషనల్ అయ్యారు.

గీతాంజలి మరణవార్త కేఎస్ ప్రసాద్ ను కలచి వేసింది. గీతాంజలి మృతి గురించి స్పందిస్తూ.. ఎక్కడున్నా గీతాంజలి ఆత్మ శాంతించాలని కోరుకున్నారు. ఆ ఇద్దరు చిన్నారుల విషయంలో కేఎస్ ప్రసాద్ భావోద్వేగానికి లోనయ్యారు. “డబ్బుతో కొన్ని కొనలేం.. తల్లి ప్రేమను అస్సలు కొనలేం. ఆ కుటుంబానికి సీఎం జగన్ రూ.20 లక్షల ఆర్థిక సాయం చేశారు. కానీ, కొన్ని మాత్రం మనం డబ్బుతో కొనలేం. సోషల్ మీడియా ఎంతో దారుణంగా తయారైంది. నన్ను ఎలా తిడతారో నాకు తెలుసు. ఫోన్లు చేసి ఎలా తిడుతున్నారో తెలుసు. భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. వైసీపీ కార్యకర్త- జనసేన కార్యకర్త.. వీళ్లని వాళ్లు వాళ్లని వీళ్లు తిట్టుకున్నారు అంటే అర్థం ఉంది. ఎవరు అసలు ఆమె.. ఆ అమ్మాయి సెంటు భూమి పట్టా అందుకుంది అంటేనే బిలో పావర్టీలో ఉన్న అమ్మాయి. అలాంటి వాళ్లను కూడా వదట్లేదు అంటే.. ఏం అనాలి” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు గీతాంజలి ఆత్మహత్య వ్యవహారం సీఎం జగన్ దృష్టికి వెళ్లింది. గీతాంజలి మరణ వార్త సీఎం జగన్ మనసును కలచి వేసింది. వెంటనే ఆ కుటుంబానికి అండగా ఉండాలంటూ అధికారులను ఆదేశించారు. ఇద్దరు చిన్నారులకు తల్లిలేని లోటు తీర్చలేమన్నారు. కానీ, ఆ పసి బిడ్డల భవిష్యత్ కోసం 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఈ ఘటనకు కారణమైన ఎవరినీ వదిలి పెట్టకూడదని స్పష్టం చేశారు. గీతాంజలి ఆత్మహత్యకు కారకులైన వారిని కఠింనంగా శిక్షించాలని సీఎం జగన్ ఆదేశించారు. హోంమంత్రి తానేటి వనిత కూడా ఈ విషాదానికి కారణమైన ఎవరినీ వదిలిపెట్టమని స్పష్టం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి