iDreamPost

Bigg Boss 7 ఫైనల్ గొడవ.. మరో 16 మందిని అరెస్టు చేసిన పోలీసులు!

బిగ్ బాస్ 7 ఫైనల్ గొడవ పై తాజాగా మరో 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతడిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

బిగ్ బాస్ 7 ఫైనల్ గొడవ పై తాజాగా మరో 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతడిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

Bigg Boss 7 ఫైనల్ గొడవ.. మరో 16 మందిని అరెస్టు చేసిన పోలీసులు!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఫైనల్ సందర్భంగా గొడవలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 17న జరిగిన బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలేలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవగా, అమర్ దీప్ రన్నరప్ గా నిలిచారు. ఇక ఫైనల్స్ సందర్భంగా ప్రశాంత్ అభిమానులు, అమర్ దీప్ అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ వీరిద్దరి ఫ్యాన్స్ గొడవలు పడ్డారు. బిగ్ బాస్ కంటెస్టెంట్ల కార్లపై దాడులు చేసి ధ్వంసం చేశారు. కంటెస్టెంట్లపై దాడులకు కూడా పాల్పడ్డారు.

అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సులపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇక తాజాగా మరో 16 మందిని అరెస్టు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఆర్టీసీ బస్సులు, పోలీసు వాహనాలపై దాడులకు పాల్పడిన వారిని గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో 12 మంది మేజర్లు, నలుగురు మైనర్లు ఉన్నట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టైన వారిని కోర్టు ఎదుట హాజరుపర్చనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఫైనల్స్ సందర్భంగా చోటుచేసుకున్న గొడవ రోజురోజుకు ముదురుతోంది. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్టుతో ఈ వివాదం హాట్ టాపిక్ గా మారింది. పోలీసుల సూచనలు పట్టించుకోకుండా వ్యవహరించిన పల్లవి ప్రశాంత్ ను పోలీసులు నిన్న ఆయన ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి తరలించి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. విచారణ అనంతరం కోర్టు పల్లవి ప్రశాంత్ కు 14 రోజుల రిమాండ్ ను విధించింది. దీంతో పోలీసులు అతడిని చంచల్ గూడ జైలుకు తరలించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసినందుకు గాను పల్లవి ప్రశాంత్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

ఫ్యాన్స్ ను తీసుకురావద్దని బిగ్ బాస్ యజమాన్యం ప్రశాంత్ ను హెచ్చరించినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా ఫ్యాన్స్ ను పిలిపించి ఈ గొడవలకు కారణమయ్యాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ పుటేజీలను పరిశీలించిన పోలీసులు, ఆర్టీసీ బస్సులు, పోలీసు వాహనాలపై దాడులకు పాల్పడిన వారిని గుర్తించారు. ఈ క్రమంలోనే దాడులకు పాల్పడిన 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరి ఈ ఘటనలో మరో 16 మంది అరెస్టు కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి