iDreamPost

హైదరాబాద్‌ను భాగ్యనగర్ గా పిలిచిన ప్ర‌ధాని, పేరు మార్పే బీజేపీ ఎజెండానా?

హైదరాబాద్‌ను భాగ్యనగర్ గా పిలిచిన ప్ర‌ధాని, పేరు మార్పే బీజేపీ ఎజెండానా?

హైదరాబాద్ లేదా భాగ్యనగర్? బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశంలో స‌ర్ధార్ ప‌టేల్ పేరును ప్ర‌స్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, హైద‌రాబాద్ ను భాగ్యనగరంగా పిలిచారు. సర్దార్ పటేల్ ఏక్ భారత్ అనే పదాన్ని భాగ్యనగరంలోనే ఉపయోగించారని ప్రధాని అన్నారు.

నిజానికి జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల ఆహ్వానంలోనూ హైద‌రాబాద్ అనే ఉంది. ఎక్క‌డా భాగ్య‌న‌గ‌ర్ అన్న ప్ర‌స్తావ‌నా లేదు. రాజ‌కీయ తీర్మానాల్లోనూ ఈ మాట వినిపించ‌లేదు. మ‌రెందుకు ప్ర‌ధాని హైద‌రాబాద్ కు బ‌దులు, భాగ్య‌న‌గ‌ర్ అని అన్న‌ట్లు?

హైదరాబాద్ భాగ్యనగరం, ఇది మనందరికీ ఎంతో ముఖ్యమైంది. సర్దార్ పటేల్ స‌మైక్య భార‌తావ‌నికి పునాది వేశారు. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం బీజేపీ బాధ్యత అని ప్ర‌ధాని అన్నార‌ని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.

ఇదేమీ కొత్త‌డిమాండ్ కాదు. ఎప్పుడు ఎన్నిక‌లొచ్చినా హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మార్చాల‌ని బీజేపీ డిమాండ్ చేస్తూనే ఉంటుంది.

మ‌రి హైద‌రాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తారా అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను మీడియా అడిగితే , రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే కేబినెట్ స‌మావేశంలో సీఎం నిర్ణయం తీసుకుంటార‌ని చెప్పారు.

జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశానికి హైద‌రాబాద్ ను ఎంచుకోవ‌డం వెనుక రాజ‌కీయ‌, వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ ఉంది. ప‌ట్టుబిగిస్తే అధికారంలోకి రాగ‌ల ప్రాంతాల్లో, ఎద‌గ‌డం కోసం స‌మావేశాల‌కు ప్రాంతాల‌ను బీజేపీ ఎంపిక చేస్తుంది.

2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2017లో ఒడిశా, 2016లో కేరళ, 2015లో బెంగళూరులో మాత్ర‌మే స‌మావేశాలు నిర్వ‌హించింది. బ‌డిశాలో ఎదిగింది. క‌ర్నాట‌క‌లో అధికారంలో ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి