iDreamPost

వీడియో: మద్యం తరలిస్తున్న కారుకు ప్రమాదం.. బాటిళ్లు ఎత్తుకెళ్లిన జనం

ఈ మద్య దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతి వేగం, నిర్లక్షంగా వాహనాలు నడపడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.

ఈ మద్య దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతి వేగం, నిర్లక్షంగా వాహనాలు నడపడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.

వీడియో: మద్యం తరలిస్తున్న కారుకు ప్రమాదం.. బాటిళ్లు ఎత్తుకెళ్లిన జనం

దేశంలో ప్రతిరోజు పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవింగ్ చేసే సమయంలో అనుకోని ప్రమాదాలు సంభవించడం, డ్రైవర్లు మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల, అతి వేగంగా వాహనాన్ని నడిపించడం వల్ల అదుపుతప్పిపోవడం ఇలా ఎన్నో కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్లు చేస్తున్న పొరపాటు వల్ల ఎంతోమంది అమాయకుల నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎంతోమంది అనాథలుగా మిగిలిపోతున్నారు. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినం చేస్తున్న ఎక్కడో అక్కడ ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. తాజాగా బీహార్ లోని జాతీయ రహదారిపై ఓ కారు ప్రమాదానికి గురైంది. వివరాల్లోకి వెళితే..

బీహార్ లో ప్రస్తుతం మద్య నిషేదం అమలవుతున్న విషయం తెలిసిందే. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి రక రకాల పద్దతుల్లో అక్రమంగా మద్యం తరలిస్తూ ఉంటారు కేటుగాళ్ళు. ఈ క్రమంలోనే మెడిసన్ పేరు చెప్పి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ కారు అనుకోకుండా ప్రమాదానికి గురైంది. కారులో మద్యం బాటిళ్ళు ఉన్నాయని తెలియగానే స్థానికంగా ఉన్న జనాలు అందినకాడికి బాటిళ్లు ఎత్తుకెళ్లారు. ఈ తతంగాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అందరినీ పంపించారు. కేసు నమోదు చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం..

2016 నుంచి బీహార్ రాష్ట్రంలో సంపూర్ణమద్య నిషేదం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కానీ.. ఇక్కడ మద్యం దందా ఎక్కువగానే సాగుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది కేటుగాళ్ళు గుట్టు చప్పుకు కాకుండా మద్యం సరఫరా చేస్తుంటారు. పోలీసులు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినా.. వారి కళ్లు కప్పి తమ దందా కొనసాగిస్తుంటారు. ఈ క్రమంలోనే విదేశీ మద్యాన్ని ఓ కారులో అక్రమంగా తరలిస్తున్నారు. వేగంగా వెళ్తున్న ఆ కారు మరో వాహనాన్ని ఢీ కొట్టి ఆగిపోయింది. దీంతో అందులో ఉన్న డ్రైవర్ కారును వదిలి పారిపోయాడు. సహాయం చేద్దామని అక్కడికి వచ్చిన జనాలు కారులోపల మద్యం బాటిళ్లు కనిపించడంతో అందినంత వరకు ఎత్తుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అందరిని పంపించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ అధికారి ప్రేమ్ ప్రకా మాట్లాడుతూ.. మద్యం బాటిళ్లు అక్రమంగా తరలించడం తప్పు.. వాటిని ఎత్తుకెళ్లడం కూడా తప్పే.. ఇరువురిపై చర్యలు తీసుకుంటాం అని అన్నారు. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తుల కోసం గాలిస్తున్నామని అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి