iDreamPost

బాబు అరెస్ట్‌తో పవన్ బుక్! ఫ్యాన్స్‌లో కూడా తీవ్ర అసహనం!

  • Published Sep 10, 2023 | 11:37 AMUpdated Sep 10, 2023 | 11:37 AM
  • Published Sep 10, 2023 | 11:37 AMUpdated Sep 10, 2023 | 11:37 AM
బాబు అరెస్ట్‌తో పవన్ బుక్! ఫ్యాన్స్‌లో కూడా తీవ్ర అసహనం!

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో భాగంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రూ.371 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఏపీ సీఐడీ ఆయనను శనివారం అరెస్ట్‌ చేసింది. అరెస్ట్‌కు ముందే ప్రాథమిక ఆధారాలు సేకరించిన తర్వాత బాబును అరెస్ట్‌ చేసినట్లు సీఐడీ పేర్కొంది. ప్రస్తుతం విజయవాడలోని ఏసీబీ కోర్టులో బాబును రిమాండ్‌కు పంపాలా? బెయిల్‌ మంజూరు చేయాలనే విషయంపై వాదనలు జరుగుతున్నాయి. ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.

ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ శనివారం అర్ధరాత్రి చంద్రబాబును కలిసేందుకు హైదరాబాద్‌ నుంచి ఏపీకి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి వెళ్లారు. ఆయనను అనుమంచిపల్లిలో ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పవన్‌ కళ్యాణ్‌.. పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. రోడ్డుపై పడుకుని నానా హంగామా చేశారు. కారుపైకి ఎక్కి కూర్చోని, పోలీసులకు సహకరించకుండా.. సినిమాటిక్‌ స్టైల్లో పిల్ల చేష్టలతో పోలీసులకు విసుగుతెప్పించారు. చూసి చూసి సహనం నశించిన పోలీసులు.. పవన్‌ కళ్యాణ్‌తో పాటు నాదెండ్ల మనోహర్‌ను సైతం అదుపులోకి తీసుకుని, పోలీసు వాహనంలో మంగళగిరికి తరలించారు.

అయితే.. శనివారం అర్ధరాత్రి పవన్‌ చేసిన హంగామాపై ఆయన అభిమానులే అసహనం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి కేసులో అరెస్ట్‌ అయిన వ్యక్తి కోసం పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు ఇంతలా హడావిడి చేస్తున్నాడంటూ మండిపడుతున్నారు. ప్రాథమిక ఆధారాలతో సీఐడీ అరెస్ట్‌ చేస్తే.. పవన్‌ ఎందుకు ఇంతలా ఉలిక్కిపడుతున్నాడో తమకు అర్థం కావడం లేదని అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోకుండా.. సినిమా షూటింగ్‌లకు వెళ్లిపోయి.. బాబు అరెస్ట్‌ కాగానే పోలో మంటూ షూటింగ్స్‌ అన్ని క్యాన్సిల్‌ చేసుకొచ్చి.. అర్ధరాత్రి ఈ రచ్చదేనికోసమంటూ ఆయన అభిమానులే విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: చంద్రబాబు అరెస్టుపై రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి