iDreamPost

నటి పవిత్రా జయరాం కుమార్తె ఎమోషనల్.. అలా మాట్లాడద్దు అంటూ!

Pavitra Jayaram Daughter Emotional: త్రినయని సీరియల్ నటి పవిత్రా జయరాం మృతితో బుల్లితెరలో విషాదం నెలకొంది. రెండ్రోజుల్లోనే చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ విషయాలపై పవిత్రా జయరాం కుమార్తె ఎమోషనల్ అయ్యింది.

Pavitra Jayaram Daughter Emotional: త్రినయని సీరియల్ నటి పవిత్రా జయరాం మృతితో బుల్లితెరలో విషాదం నెలకొంది. రెండ్రోజుల్లోనే చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ విషయాలపై పవిత్రా జయరాం కుమార్తె ఎమోషనల్ అయ్యింది.

నటి పవిత్రా జయరాం కుమార్తె ఎమోషనల్.. అలా మాట్లాడద్దు అంటూ!

గత కొన్ని రోజులాగ పవిత్రా జయరాం పేరు వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. మహబూబ్ నగర్లో జరిగిన కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి పవిత్రా జయరాం ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత సీరియల్ నటుడు చంద్రకాంత్ పలు ఇంటర్వ్యూలు ఇచ్చి ప్రమాదం గురించి వివరించాడు. అలాగే తన పవిత్రా వెళ్లిపోయింది అంటూ బోరున విలపించాడు. ఆ తర్వాత మే 17న పవిత్రా గురించి సిరీస్ ఆఫ్ ట్వీస్ట్ చేశాడు. తన పవిత్రా పుట్టిన రోజు అని.. తను లేకుండా ఉండలేకపోతున్నా అంటూ పోస్టులు పెట్టాడు. ఆ తర్వాత చూస్తే.. చంద్రకాంత్ మణికొండలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ బలవన్మరణంపై చంద్రకాంత్ కుటుంబం స్పందించింది. తాజాగా పవిత్రా జయరాం కుమార్తె రియాక్ట్ అయ్యింది.

పవిత్రా జయరాం- చంద్రకాంత్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని.. గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు అంటూ చాలానే వార్తలు వచ్చాయి. వాటిని వీళ్లు ఖండించలేదు కూడా . తాజా ఘటనతో అది నిజమే అంటూ చాలామంది ఫిక్సవుతున్నారు. అంతేకాకుండా జయరామ్ భార్య కూడా వారి బంధం గురించి ఓపెన్ కామెంట్స్ చేసింది. పవిత్రా పరిచయం అయ్యాకే.. తన జీవితం నాశనం అయ్యిందంటూ చెప్పుకొచ్చింది. ఇలా వారి ఇద్దరికి సంబంధించి చాలానే విమర్శలు వచ్చాయి. అయితే వాటిపై తాజాగా పవిత్రా జయరాం కుమార్తె ప్రతీక్ష రియాక్ట్ అయ్యింది. అందరికీ ఆమె ఒక రిక్వెస్ట్ కూడా చేసుకుంది.

చంద్దకాంత్- పవిత్రా జయరాంలు మంచి స్నేహితులని వెల్లడించింది. చందు- తన తల్లి పవిత్రల బంధం గురించి తప్పుగా మాట్లాడద్దు అంటూ అందరికీ విజ్ఞప్తి చేసింది. తనతో కూడా చందు తరచూ ఫోన్లో మాట్లాడేవాడని చెప్పుకొచ్చింది. పైగా తనను బాగా చదువుకోవాలి అని ఎంకరేజ్ చేసేవాడు అంటూ తెలిపింది. తన తల్లి అంత్యక్రియలకు కూడా చందు హాజరయ్యాడు అంటూ పవిత్ర కుమార్తె తెలియజేసింది. అయితే చంద్రకాంత్ భార్య శిల్ప మాత్రం వారిది అక్రమ సంబంధమే అంటూ స్పష్టం చేసింది. త్రినయని సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి వారి మధ్య వివాహేతర సంబంధం మొదలైందంటూ విమర్శించింది. తమ జీవితాలు ఇలా అయిపోవడానికి కూడా ఆ బంధమే కారణం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం బుల్లితెరలో పవిత్రా జయరాం మృతి, చంద్రకాంత్ ఆత్మహత్య హాట్ టాపిక్ అయ్యింది. అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి