iDreamPost

అయోధ్య రామమందిర్ ప్రధాన అర్చకులు లక్ష్మీకాంత దీక్షిత్ ఎవరు?

యావత్ భారత దేశం ఎదురు చూస్తున్న అద్భుత ఘట్టం ముగిసింది.. అయోధ్యలో రామమందిరంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట మహోత్సవం ముగిసింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ వేడుక జరిగింది.

యావత్ భారత దేశం ఎదురు చూస్తున్న అద్భుత ఘట్టం ముగిసింది.. అయోధ్యలో రామమందిరంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట మహోత్సవం ముగిసింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ వేడుక జరిగింది.

అయోధ్య రామమందిర్ ప్రధాన అర్చకులు లక్ష్మీకాంత దీక్షిత్ ఎవరు?

భారత దేశంలో కోట్ల మంది రామ భక్తులు ఎదురు చూస్తున్న అద్భుతం కళ్ల ముందు సాకారమైంది. నేడు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ మందిరం ప్రారంభోత్సవం ప్రారంభం అయ్యింది. రాంలాలా విగ్రహ ప్రాణ ప్రతిష్ట సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1 గంటల మధ్యలో ముగిసింది. దేశ వ్యాప్తంగా పల్లె, పట్నం, నగరాల్లో పలు విధుల్లో, దేవాలయాల్లో, ముఖ్య ప్రదేశాల్లో ప్రత్యక్షంగా విక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖ సినీ సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, క్రీడా, వ్యాపార రంగానికి చెందిన వారు హాజరయ్యారు. అయోధ్యలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తుంది. రామ్ లల్లా పవిత్రోత్సవం సందర్భంగా గర్భగుడిలో ప్రధాన అర్చకులు లక్ష్మికాంత దీక్షిత్ సహా ఐదుగురు ఉంటారు. అసలు లక్ష్మీకాంత్ దీక్షిత్ ఎవరూ? ఆయనకు ఎందుకు అంత ప్రాముఖ్యత అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

అయోధ్య రామ మందిరంలో ప్రధాన నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాం లల్లా ప్రాణ ప్రతిష్ట పవిత్రోత్సవం ముగిసింది. 121 మంది పూజారుల బృందం రామ మందిరం ప్రతిష్టాపనను నిర్వహిస్తుంది. ఈ పవిత్రోత్సవానికి ప్రధాన అర్చకులుగా కాశీ పండితులు లక్ష్మీకాంత దీక్షితులు ప్రధాన అర్చకులుగా వ్యవహరిస్తున్నారు. ఆయనతోపాటు మరో ఐదురురు పూజారులు గర్భగుడిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ప్రధాన అర్చకులు లక్ష్మీకాంత దీక్షితుల విషయానికి వస్తే.. ఆయన స్వస్థలం మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా. కానీ ఆయన కుటుంబం చాలా తరాలుగా కాశీలో జీవిస్తున్నారు. లక్ష్మీకాంత దీక్షిత్ పూర్వికులు నాగ్ పూర్, నాసిక్ రాచరిక రాష్ట్రాల్లో అనేక మతపరమైన ఆచారాలు నిర్వహిస్తుంటారు.

లక్ష్మీకాంత దీక్షిత్ లు వారణాసిలోని మీఘాట్ లో ఉన్న సంగ్వేద కళాశాల సీనియర్ ప్రొఫెసర్ గా పనిచేశారు. ఈ కళాశాల కాశీ రాజు స్థాపించారు. పండిట్ లక్ష్మీకాంత్ కాశీలో యజుర్వేదంలో గొప్ప పండితులుగా పిలబడుతున్నారు. ఆయన పూజా విధానంలో ఎంతో ప్రావిణ్యం సంపాదించారు. ఆయన మేనమామ గణేశ్ దీక్షిత్ భట్ నుంచి వేదాలు, ఆచారాలలో దీక్ష దీసుకున్నారు లక్ష్మీ కాంత్ దీక్షితులు. 17వ శతాబ్దంలో చత్రిపతి శివాజీ మహరాజ్ పట్టాభిషేకం చేసిన పండిట్ గాగా భట్, లక్ష్మీకాంత పూర్వికులని చెబుతుంటారు. లక్ష్మీకాంత దీక్షిత్ ఆధ్వర్యంలో రామ మందిరంలో జనవరి 16 నుంచి 121 పండితులతో ప్రాణ ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి