iDreamPost

Pallavi Prashanth: బెయిల్ విషయంలో పల్లవి ప్రశాంత్‌కు షాక్

రైతు బిడ్డ, సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్ లోెకి అడుగుపెట్టి టైటిల్ గెలుచుకున్న పల్లవి ప్రశాంత్.. ఆ తర్వాత వివాదాల్లో చిక్కుకున్నాడు. పోలీసుల ఉత్తర్వులు బేఖాతరు చేస్తూ ర్యాలీని చేపట్టడంతో పాటు ఫ్యాన్స్ రెచ్చిపోవడానికి కారణమయ్యాడన్న ఆరోపణలపై పోలీసులు అతడిని అరెస్టు చేసిన సంగతి విదితమే.

రైతు బిడ్డ, సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్ లోెకి అడుగుపెట్టి టైటిల్ గెలుచుకున్న పల్లవి ప్రశాంత్.. ఆ తర్వాత వివాదాల్లో చిక్కుకున్నాడు. పోలీసుల ఉత్తర్వులు బేఖాతరు చేస్తూ ర్యాలీని చేపట్టడంతో పాటు ఫ్యాన్స్ రెచ్చిపోవడానికి కారణమయ్యాడన్న ఆరోపణలపై పోలీసులు అతడిని అరెస్టు చేసిన సంగతి విదితమే.

Pallavi Prashanth: బెయిల్ విషయంలో పల్లవి ప్రశాంత్‌కు షాక్

బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు బిగ్ షాక్ తగిలింది.  ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కేసులో బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ అరెస్టైన సంగతి విదితమే. అతడిని బుధవారం జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి.. నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా.. 14 రోజుల రిమాండ్ విధించింది. అతడిని చంచల్ గూడ జైలుకు తరలించారు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయితే అతడు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అతడి బెయిల్ పిటిషన్‌ను విచారించిన నాంపల్లి కోర్టు.. తీర్పును రేపటికి వాయిదా వేసింది.  సామాన్యుడిగా, రైతు బిడ్డగా బిగ్ బాస్ సీజన్ 7లో ఓ కంటెస్టెంట్‌గా ఆ హౌస్‌లోకి అడుగు పెట్టిన పల్లవి ప్రశాంత్.. తన ఆట, మాట తీరుతో టైటిల్ విన్ అయ్యాడు. కప్ గెలిచాడు. ఇది తెలిసిన అతడి ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియో వద్దకు వచ్చి రచ్చ రచ్చ చేశారు. అయితే బయట ఇంత ఇష్యూ జరుగుతుందని తెలిసిన పోలీసులు..అతడిని మరో మార్గం గుండా వెనక్కు పంపేశారు. ర్యాలీ చేయవద్దని చెప్పారు. కానీ ప్రశాంత్ అవేమీ పట్టించుకోకుండా.. ఫ్యాన్స్ వద్దకు రావడంతో వారు మరింత రెచ్చిపోయారు.

అసలు ఏం జరిగిందంటే..?

బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాల్ ఈ నెల 17న ముగిసింది. విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఈ కార్యక్రమంటీవీల్లో ప్రసారం అవుతుండగానే.. అతడి ఫ్యాన్స్ స్టూడియో వద్దకు వచ్చి నానా హంగామా చేశారు. మరో కంటెస్టెంట్, రన్నరప్ అమర్ దీప్ చౌదరి అభిమానులతో గొడవపడ్డారు. బస్సులు అద్దాలను పగులకొట్టారు. అశ్వినీ, గీతూ రాయల్ కార్లపై దాడి చేశారు. ఇదిలా ఉంటే అమర్ దీప్ ఫ్యామిలీ వస్తున్న కారును అడ్డుకోవడమే కాకుండా.. వాహనంపై రాళ్లు రువ్వి తేజస్విని, ఆమె అత్తను భయభ్రాంతులకు గురి చేశారు.  వారిని  బూతులు తిట్టారు. దీంతో అలర్ట్ అయిన బిగ్ బాస్ యాజమాన్యం, పోలీసుల సహకారంతో అతడిని మరో గేట్ గుండా బయటకు పంపించారు. ఫ్యాన్స్ ఉన్న చోటుకు వెళ్లొద్దని, ర్యాలీ చేపట్టొద్దని హితవు పలికారు పోలీసులు.

కానీ పల్లవి ప్రశాంత్ పట్టించుకోకుండా.. అభిమానులు ఉన్న చోటుకు వెళ్లారు. భారీ ఎత్తున ర్యాలీలు చేపట్టారు. దీంతో ఫ్యాన్స్ మరింత రెచ్చిపోవడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పహారా కాస్తున్నప్పటికీ.. వారి వాహనాలను కూడా ధ్వంసం చేశారు.  ఈ విషయంపై పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ మొత్తానికి పల్లవి ప్రశాంత్ కారణమని తేల్చి.. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతలో అతడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. పరారీలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ నేను ఇంట్లోనే ఉన్నానంటూ వీడియో విడుదల చేయడంతో.. పోలీసులు అతడి స్వస్థలానికి వెళ్లి అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు.  కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించగా.. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు పల్లవి ప్రశాంత్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి