iDreamPost

వీడియో: నవ్వుల పాలవుతున్న పాకిస్థాన్‌ ఫీల్డింగ్‌! మీకు మీరే సాటి..

చెత్త ఫీల్డింగ్ తో గత కొంతకాలంగా పాకిస్తాన్ ఆటగాళ్లు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ వస్తున్నారు. కానీ ఎన్ని తిట్లు తిన్నా వారి తీరుమారలేదు. తాజాగా మరోసారి చెత్త ఫీల్డింగ్ తో నవ్వులపాలైయ్యారు.

చెత్త ఫీల్డింగ్ తో గత కొంతకాలంగా పాకిస్తాన్ ఆటగాళ్లు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ వస్తున్నారు. కానీ ఎన్ని తిట్లు తిన్నా వారి తీరుమారలేదు. తాజాగా మరోసారి చెత్త ఫీల్డింగ్ తో నవ్వులపాలైయ్యారు.

వీడియో: నవ్వుల పాలవుతున్న పాకిస్థాన్‌ ఫీల్డింగ్‌! మీకు మీరే సాటి..

పాకిస్థాన్.. ప్రపంచ క్రికెట్ లో ఎక్కువ విమర్శలపాలయ్యే దేశం. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్ 2023లో దారుణ ప్రదర్శనతో ఇంటిముఖం పట్టిన పాక్, వరల్డ్ వైడ్ గా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈ వైఫల్యంతో పాక్ క్రికెట్ బోర్డు అతలాకుతలం అయ్యిందనే చెప్పాలి. కోచ్ లు, కెప్టెన్ లు, బోర్డు సభ్యులు మారడం వంటి పరిణామాలు మనకు తెలియనివి కావు. వీటికితోడు పాక్ టీమ్ గత కొంతకాలంగా చెత్త ఫీల్డింగ్ చేస్తూ.. మ్యాచ్ లు ఓడిపోతూ వస్తోంది. ఇటీవల ముగిసిన ఆసీస్ సిరీస్ లో ఇది నిరూపితమైంది కూడా. తాజాగా మరోసారి చెత్త ఫీల్డింగ్ తో నవ్వులపాలైయ్యారు పాక్ ఫీల్డర్లు.

ప్రస్తుతం పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్(PSL) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ లీగ్ లో పాక్ ఫీల్డర్లు తమ మిస్ ఫీల్డింగ్ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. మెున్న ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో సింపుల్ క్యాచ్ లను జారవిడిచి అబాసుపాలైన పాక్ ఆటగాళ్లు.. తమ తీరును మాత్రం మార్చుకోలేదు. ఈ లీగ్ లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్ లో బ్యాటర్ భారీ షాట్ కొట్టాడు. ఆ బాల్ కాస్త కీపర్ వెనకాల గాల్లోకి లేచి.. బౌండరీ దగ్గరగా పడింది. కీపర్ మహ్మద్ రిజ్వాన్ అక్కడి వరకూ పరిగెత్తుకెళ్లాడు బాల్ ను ఫుట్ బాల్ రీతిలో కాలుతో బౌండరీ వెళ్లకుండా ఆపాడు.

అయితే అక్కడికి వేగంగా దూసుకొచ్చిన మరో ప్లేయర్ ఆ బాల్ ను అచ్చం ఫుట్ బాల్ ని తన్నినట్లే తన్నాడు. అయితే ఈ టైమ్ లో అతడి ఇంకో కాలు బౌండరీ లైన్ ను తాకినట్లు రిప్లేలో కనిపించింది. ఇంకేముంది మరోసారి నవ్వులపాలవ్వడం పాక్ ఆటగాళ్ల వంతైంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో.. నెటిజన్లు పాక్ ప్లేయర్లను ఓ ఆటాడుకుంటున్నారు. మీరు ఆడేది క్రికెట్.. ఫుట్ బాల్ కాదు.. మీకంటే గల్లీలో ఆడే పిల్లలు నయ్యం.. వెళ్లి వారి దగ్గర ఫీల్డింగ్ నేర్చుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదికూడా చదవండి: విధ్వంసానికి మారుపేరు.. 21 బంతుల్లోనే సెంచరీ! వరల్డ్ రికార్డు బద్దలు..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి