iDreamPost

పవన్ కల్యాణ్ కు OU విద్యార్థుల హెచ్చరిక!

మంగళవారం హైదరాబాద్ లో బీజేపీ బీసీ ఆత్మ గౌరవ సభ నిర్వహించారు. ఈ సభలో పవన్ కల్యాణ్  కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ వ్యాఖ్యలపై ఓయూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మంగళవారం హైదరాబాద్ లో బీజేపీ బీసీ ఆత్మ గౌరవ సభ నిర్వహించారు. ఈ సభలో పవన్ కల్యాణ్  కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ వ్యాఖ్యలపై ఓయూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పవన్ కల్యాణ్ కు OU విద్యార్థుల హెచ్చరిక!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30 నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. గెలుపే లక్ష్యగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. మంగళవారం హైదరాబాద్ లోని ఎల్బీస్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మ గౌరవ సభ నిర్వహించారు. ఈ సభకు ప్రధాని మోడీతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విచ్చేసారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్  కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ వ్యాఖ్యలపై ఓయూ విధ్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ఏకంగా ఓయూ విద్యార్థులు వార్నింగ్ సైతం ఇచ్చారు.

తెలంగాణ ఎన్నికల్లో బిజెపి, జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ నిర్వహించిన సభలో పవన్ కల్యాణ్ హాజరవుతున్నారు. మంగళవారం బీజేపీ నిర్వహించిన బీసీ సభలో పవన్ కల్యాణఅ పాల్గొన్నారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. సకల జనులు సమరం చేస్తేనే తెలంగాణ వచ్చిందని పవన్‌ అన్నారు. ‘జల్‌, జంగల్‌, జమీన్‌ అంటూ కుమురం భీం పోరాడారని, నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని తెలిపారు. అయితే రాష్ట్రం వచ్చి కూడా ఫలితాలు అందరికీ అందని పరిస్థితి ఉందని అన్నారు.

మోదీ ఎన్నికలనే దృష్టిలో పెట్టుకుంటే ఆర్టికల్‌ 370 రద్దు చేసేవారు కాదని, అదే విధంగా మహిళా బిల్లు తెచ్చేవారు కాదని పవన్ పేర్కొన్నారు. అంతేకాక ఎన్నికలే ముఖ్యం అనుకుంటే ఎన్నో కీలక నిర్ణయాలు మోదీ తీసుకునేవారు కాదని, భారతీయుల గుండెల్లో ధైర్యం నింపిన వ్యక్తి ప్రధాని మోదీని పవన్ తెలిపారు. 3 దశాబ్దాల ప్రగతిని ఒక్క దశాబ్దంలోనే మోదీ సాధించారని పవన్‌ కల్యాణ్ అన్నారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియమాకాల కోసం జరిగిందని, కానీ అవి అమలు జరిగాయా? అని పవన్ ప్రశ్నించారు.

దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఓ దళారి అని.. ఆయన ఓ ఐటమ్ సాంగ్ చేసే వ్యక్తి అని విద్యార్థులుఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పవన్ ఏనాడు పోరాడలేదు. ఏనాడు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ ఇక్కడ రాజకీయాలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు ఓయూ విద్యార్థులు. పవన్ ను తరిమికొడతామన వార్నింగ్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ గో బ్యాంక్ అంటూ ఫ్లకార్టులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.

ఇక మరోవైపు బీజేపీ పొత్తులో భాగంగా ఈ నెల 30న జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న జనసేన అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయనుంది. ఆ స్థానాలకు అభ్యర్థులను కూడా జనసేన ప్రకటించింది. మరి.. పవన్ కల్యాణ్ కి ఓయూ విద్యార్థులు వార్నింగ్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి