iDreamPost

తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకే మహిళతో ప్రేమ.. OTTలో ఇది మామూలు సినిమా కాదు!

OTT Suggestions- Best Watch Alone Movie: ఓటీటీలో కొన్ని కొన్ని వింత కథలు, విచిత్రమైన సినిమాలు ఉన్నాయి. వాటిని చూస్తే మీకు మామూలు కిక్కు రాదు. అలాంటి ఒక స్టోరీని మీకోసం తీసుకొచ్చాం. ఇందులో ఒక్కో సీన్ ఓ రేంజ్ లో ఉంటుంది.

OTT Suggestions- Best Watch Alone Movie: ఓటీటీలో కొన్ని కొన్ని వింత కథలు, విచిత్రమైన సినిమాలు ఉన్నాయి. వాటిని చూస్తే మీకు మామూలు కిక్కు రాదు. అలాంటి ఒక స్టోరీని మీకోసం తీసుకొచ్చాం. ఇందులో ఒక్కో సీన్ ఓ రేంజ్ లో ఉంటుంది.

తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకే మహిళతో ప్రేమ.. OTTలో ఇది మామూలు సినిమా కాదు!

ఓటీటీల్లో ఎప్పుడూ యాక్షన్, ఎమోషన్, కామెడీ డ్రామాలే కాకుండా.. అప్పుడప్పుడు కొన్ని కొన్ని వింత కథలను కూడా పలకరిస్తూ ఉండాలి. అలాంటి వింత కథలు కావాలి అంటే మీరు కచ్చితంగా హాలీవుడ్ సినిమాలు చూడాల్సిందే. ఎందుకంటే అక్కడ మీకు కావాల్సినన్ని వింత ప్రేమ కథలు కనిపిస్తాయి. అలాంటి ఒక క్రేజీ మూవీని ఇవాళ మీకోసం తీసుకొచ్చాం. ఆ మూవీ మామూలుగా ఉండదు. ఎందుకంటే తండ్రీకొడుకులు ఇద్దరు ఒకే మహిళ ప్రేమలో పడతారు. అలా పడటం మాత్రమే కాకుండా.. ఆమె కోసం వీళ్లు కొట్టుకుంటారు కూడా. వినడానికే కాస్త విడ్డూరంగా ఉంది కదా? చూడటానికి ఇంకా వింతగా ఉంటుంది.

సాధారణంగా ఇప్పుడు సమాజంలో సక్రమం కాని సంబంధాలు చాలానే ఉన్నాయి. కానీ, ఇలాంటి కొన్ని సంబంధాలు అయితే ఇంకా మనదాకా రాలేదు. ఎందుకంటే తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకే అమ్మాయిని ఇష్టపడటం అంటే కాస్త వినడానికి కూడా విచిత్రంగా, కాస్త జుగుప్సాకరంగా ఉంది. అయితే అలాంటి ఒక సినిమా చూడాలి అంటే ఎలా ఉంటుంది? కానీ, ఎప్పుడో ఒక్కసారి అయినా ఇలాంటి కొన్ని క్రేజీ లవ్ స్టోరీస్ చూడాలి. అలా అయితే కొత్త కథలు మనకు తారసపడినట్లు ఉంటుంది. ఈ మూవీ చూస్తే మీకు దాదాపుగా ఫ్యూజులు ఎగిరిపోయినంత పనే అవుతుంది. ఆ కొడుకు నిజానికి ఆమెను ప్రేమించాలి అనుకోడు. కానీ, విధి వెక్కిరిచండంతో అదే జరుగుతుంది.

అసలు అక్కడ ఏం జరుగుతుందంటే.. ఈ కొడుకు తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి హోటల్ కు వెళ్తాడు. ఆ రోజు రాత్రి అక్కడకు మరో మహిళతో తన భర్త అక్కడకు వస్తాడు. అది చూసి తండ్రి తన తల్లికి అన్యాయం చేస్తున్నాడు అనే విషయాన్ని గ్రహిస్తాడు. అయితే ఆ మహిళ ఎవరు తెలుసుకోవాలి అని తాపత్రయ పడతాడు. అందుకోసం ఆమెను ఫాలో చేస్తాడు. ఆ తర్వాత ఆమెను కలిసి మాట్లాడతాడు కూడా . ఈ నగరంలో నీకు ఎవరూ దొరకలేదా? నా తండ్రిని ఎందుకు ముగ్గులోకి దించావ్ అంటూ ప్రశ్నిస్తాడు. అయితే అందుకు ఆ మహిళ ఎవరిని లవ్ చేయాలి? నిన్ను చేయనా అంటూ సమాధానం ఇస్తుంది. అంతేకాకుండా.. అతని బుర్రలో కొత్త ఆలోచనను రేకెత్తిస్తుంది.

అక్కడి నుంచే అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఆ కుర్రాడు.. ఆ మహిళను ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అలా చిన్నగా ఆమె వలలో చిక్కుకుంటాడు. ఆ కుర్రాడి గర్ల్ ఫ్రెండ్ ఎంత హెచ్చరిస్తున్నా కూడా ఆమెకు దగ్గరైపోతాడు. ఆ తర్వాత అసలు విషయం తండ్రికి తెలుస్తుంది. ఇంకేముంది.. కొడుకుపై గొడవకు వెళ్తాడు. అలా ఇద్దరూ ఒకే మహిళతో సంబంధం పెట్టుకుంటారు. ఇదంతా పూర్తి కథ కాదు.. ఇంకా చాలా ఉంది. ఒక్కో సీన్ కి పిచ్చెక్కిపోతారు. మీ బుర్ర గిర్రున తిరుగుతుంది. ఈ సినిమా పేరు ది ‘ఓన్లీ లివింగ్ బాయ్ ఇన్ న్యూయార్క్‘. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి