iDreamPost

తండ్రి ఆత్మే కూతుర్ని వెంటాడితే.. OTTలో ఈ హారర్ చిత్రానికి చెమటలు పట్టేస్తాయి!

OTT Suggestions- Best Horror Movies: ఓటీటీలో మీరు చాలానే బెస్ట్ హారర్ థ్రిల్లర్స్ అనే మూవీస్ చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక క్రైమ్ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీ చూసుండరు. ఒకసారి ఓటీటీలో ఈ మూవీ చూశాక వావ్ అంటారు.

OTT Suggestions- Best Horror Movies: ఓటీటీలో మీరు చాలానే బెస్ట్ హారర్ థ్రిల్లర్స్ అనే మూవీస్ చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక క్రైమ్ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీ చూసుండరు. ఒకసారి ఓటీటీలో ఈ మూవీ చూశాక వావ్ అంటారు.

తండ్రి ఆత్మే కూతుర్ని వెంటాడితే.. OTTలో ఈ హారర్ చిత్రానికి చెమటలు పట్టేస్తాయి!

ఓటీటీలో మీరు చాలానే హారర్ థ్రిల్లర్స్ చూసుంటారు. అసలు వారానికి ఒక హారర్ మూవీ చూడకపోతే పొద్దు పోని వాళ్లు చాలామందే ఉంటారు. కానీ, ఇలాంటి ఒక హారర్ చిత్రాన్ని మాత్రం మీరు చూసుండరు. ఈ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉన్నా కూడా చాలా మంది దాని వాల్యూ తెలియక లైట్ తీసుకున్నారు. అలాంటి ఒక మూవీని మీకోసం సజీషన్ తీసుకొచ్చాం. నిజానికి ఇది కేవలం హారర్ మూవీ మాత్రమే కాదు.. ఇదొక క్రైమ్ థ్రిల్లర్, ఒక సస్పెన్స్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ మూవీ. ఇందులో వచ్చే ట్విస్టులకు మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అలాంటి ఒక మూవీని మీరు ఇన్ని రోజులు ఓటీటీలు ఉన్నా కూడా చూడకుండా ఉండిపోయారు.

ఇంత హైప్ ఇస్తున్నాం అంటే ఆ మూవీలో కచ్చితంగా విషయం ఉంటుంది అనే అర్థం. ఈ మూవీ కేవలం హారర్ జానర్ మాత్రమే కాదు. ఇది క్రైమ్ థ్లిల్లర్ కూడా కావడంతో మరింత ఆసక్తిగా ఉంటుంది. ఈ చిత్రంలో మీకు ముఖ్యంగా నరేషన్ బాగా నచ్చుతుంది. ప్రతి 5 నిమిషాలకు ఒక ట్విస్టును ప్లాన్ చేశారు. చాలా స్లోగా స్టార్ట్ అయిన ఈ కథ ఆ తర్వాత బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకుపోతుంది. ఎక్కడా కూడా బ్రేకులు వేయకుండా, మీ దృష్టి మరల్చకుండా చేస్తుంది. చాలా తక్కువ సినిమాలు మాత్రమే మన కాన్సన్ ట్రేషన్ పక్కకి తిప్పకుండా చేస్తాయి. అలాంటి వాటిలో ఈ మూవీ కూడా ఉంటుంది.

ఈ మూవీ కథ విషయానికి వస్తే.. హీరోయిన్ వీల్ ఛైర్ లో ఉంటుంది. ఆమె తండ్రి ఒక పెద్ద జమిందారు. వారికి ఊరిలో ఒక పెద్ద కోట కూడా ఉంటుంది. కానీ, తండ్రిలేని ఆ యువతి విదేశాల్లో ఉండిపోతుంది. కానీ, తిరిగి సొంతూరుకి రావాల్సి వస్తుంది. ఆ సమయంలో ఆమె తండ్రి ఆత్మే ఆమెను వెంటాడుతూ ఉంటుంది. అయితే ఆమె మీద పగ తీర్చుకోవడానికి కాదు. ఆమెకు తన తండ్రిది హత్య అనే విషయాన్ని వెల్లడించడానికి. అయితే అసలు ఆయన్ను ఎవరు హత్య చేశారు? ఆత్మగా వచ్చి ఎందుకు కూతుర్ని వార్న్ చేశారు అనేది ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. మూవీ పూర్తైన తర్వాత తప్పకుండా ఒక మంచి హారర్ థ్రిల్లర్ చూశామనే భావన కలుగుతుంది.

ఈ మూవీ పేరు గ్యాస్ లైట్. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో సారా అలీ ఖాన్, విక్రాంత్ మాసే, చిత్రాంగద సింగ్ కీలక పాత్రల్లో నటించారు. వీల్ చైర్ లో కూర్చుని ఎంతో ఇన్టెన్స్ సీన్స్ బాగా పండించింది. ఇంక విక్రాంత్ మాసే కూడా కీలకపాత్రను బాగా పండించాడు. అలాగే ఈ మూవీలో అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. దాదాపుగా ఈ మూవీలో అన్నీ ట్విస్టులే ఉంటాయి. కానీ, క్లయిమ్యాక్స్ కు అందరికీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. అస్సలు మీరు ఈ కథను ఊహించలేరు. ఆ ట్విస్టులు తట్టుకోలేరు. అందుకే ఆఖరికి వావ్ అంటారు. కాకపోతే ఈ మూవీ హిందీలో ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి