iDreamPost

Bheemla Nayak : పవన్ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న సినిమాలు

Bheemla Nayak : పవన్ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న సినిమాలు

ఇంతకీ ఈ నెల 25న భీమ్లా నాయక్ వస్తోందా లేదా అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఆ డేట్ కి రావడం ఖాయమని కొందరు డిస్ట్రిబ్యూటర్లు అంటుండగా మరికొందరు మాత్రం అగ్రిమెంట్లు చేసుకున్నప్పటికీ అది ఖచ్చితంగా ఈ తేదీకే అనే భరోసాతో కాదని, వాయిదాకు సిద్ధపడే అడ్వాన్సులు ఇచ్చామని చెబుతున్నారు. మరి ఏప్రిల్ 1కి పోస్ట్ పోన్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి. ఇటీవలే జరిగిన డీజే టిల్లు ట్రైలర్ లాంచ్ లో నిర్మాత నాగవంశీ ఏపిలో నైట్ కర్ఫ్యూలు తీసేయగానే విడుదల చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. టికెట్ రేట్లతో సంబంధం లేకుండా నాలుగు షోలు పడితే చాలని అభిమానులు అర్థం చేసుకున్నారు

భీమ్లా నాయక్ 25న రావడం రాకపోవడం ఇతర సినిమాలనూ ప్రభావితం చేస్తుంది. శర్వానంద్ ఆడవాళ్ళూ మీకు జోహార్లు నేరుగా పవర్ స్టార్ తో ఢీ కొట్టే సాహసం చేయలేదు. ఆల్మోస్ట్ డ్రాప్ అవ్వాల్సిందే. కిరణ్ అబ్బవరం సెబాస్టియన్ కూడా అదే రూట్ తీసుకోక తప్పదేమో. ఒక రోజు ముందు వచ్చే అజిత్ వలిమై టాక్ కూడా కీలకంగా మారనుంది. ముఖ్యంగా కర్ణాటకలో దీని ప్రభావం ఎంత ఉంటుందనేది చూసుకోవాల్సి ఉంటుంది. కానీ ఏప్రిల్ 1కి భీమ్లా నాయక్ వెళ్తే ఆర్ఆర్ఆర్ కు దీనికి కేవలం వారం గ్యాప్ మాత్రమే వస్తుంది. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కలెక్షన్ల మీద ఎఫెక్ట్ చూపించే అంశమే. ఇవన్నీ టీమ్ పరిగణనలోకి తీసుకుంటోంది.

మరోవైపు పవన్ సినిమా క్రేజీ ఆఫర్లతో బిజినెస్ పూర్తి చేసుకుంటోంది. ఇన్ సైడ్ రిపోర్ట్స్ చాలా పాజిటివ్ గా ఉండటంతో ఫ్యాన్స్ పూనకాలు ఖాయమనే నమ్మకంతో ఉన్నారు. త్రివిక్రమ్ రచనలో సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ రివెంజ్ డ్రామాకు తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది. ఇప్పటికే ఆడియో బాగా రీచ్ అయిపోయింది. మూడు గంటలకు దగ్గరగా ఉండే ఒరిజినల్ వెర్షన్ అయ్యప్పనుం కోషియంకు భిన్నంగా కేవలం రెండుంపావు గంటల్లోనే భీమ్లా నాయక్ ఫైనల్ వెర్షన్ కట్ చేశారని వినికిడి. సరే పవన్ మూవీ ఎప్పుడు వచ్చినా రచ్చనే కానీ ఆ డేట్ గురించే ఏదో ఒకటి ఓ వారం రోజుల్లో తేల్చేయడంబెటర్

Also Read : Valimai : అజిత్ సినిమా గురించి టాక్ నిజమేనా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి