iDreamPost

SBIలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్ష వరకు జీతం.. అర్హులు వీరే?

బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ వేతనంతో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పూర్తి వివరాలు మీకోసం.

బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ వేతనంతో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పూర్తి వివరాలు మీకోసం.

SBIలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్ష వరకు జీతం.. అర్హులు వీరే?

మీరు బ్యాంకు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? బ్యాంకు ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీలాంటి వారికి గుడ్ న్యూస్. భారీ వేతనంతో బ్యాంకు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. మీరు ఈ ఉద్యోగాలను పొంది జీవితంలో ఉన్నత స్థితిలో స్థిరపడిపోవచ్చు. పరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఏ నోటిఫికేషన్ ను వదిలినా ఈ నోటిఫికేషన్ ను మాత్రం వదలొద్దు.

దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 80 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 4వ తేదీ వరకు అప్లై చేసుకునేందుకు గడువు విధించారు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ https://www.sbi.co.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

  • స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్ పోస్టులు మొత్తం:
  • 80

విభాగాల వారీగా ఖాళీలు:

అసిస్టెంట్‌ మేనేజర్‌ (సెక్యూరిటీ అనలిస్ట్‌) పోస్టులు:

  • 23

డిప్యూటీ మేనేజర్‌ (సెక్యూరిటీ అనలిస్ట్‌) పోస్టులు:

  • 51

మేనేజర్‌ (సెక్యూరిటీ అనలిస్ట్‌) పోస్టులు:

  • 03

అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ (అప్లికేషన్‌ సెక్యూరిటీ) పోస్టులు:

  • 03

అర్హత:

  • అభ్యర్థులు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంసీఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుకు 30 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్‌కు 35 ఏళ్లు, మేనేజర్‌కు 38 ఏళ్లు, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌కు 42 ఏళ్లకు మించి ఉండకూడదు.

ఎంపిక ప్రక్రియ:

  • అప్లికేషన్‌ షార్ట్‌లిస్ట్ంగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం:

  • అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుకు రూ.36,000-63,840, డిప్యూటీ మేనేజర్‌కు రూ.48,170-69,810, మేనేజర్‌కు రూ.63,840-78,230, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌కు రూ.89,890-1,00,350 అందిస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగుల అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్‌

దరఖాస్తులకు ప్రారంభ తేదీ:

  • 13-02-2024

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 04-03-2024

ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్:

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి