iDreamPost

టెన్త్, డిప్లొమా పాసయ్యారా?.. ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మీకోసమే!

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? టెన్త్, ఇంజనీరింగ్ డిప్లొమా పాసయ్యారా? అయితే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మీకోసమే. భారీ వేతనం అందుకోవచ్చు. పూర్తి వివరాలు మీకోసం.

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? టెన్త్, ఇంజనీరింగ్ డిప్లొమా పాసయ్యారా? అయితే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మీకోసమే. భారీ వేతనం అందుకోవచ్చు. పూర్తి వివరాలు మీకోసం.

టెన్త్, డిప్లొమా పాసయ్యారా?.. ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మీకోసమే!

ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మంచి వేతనంతో లైఫ్ లో సెటిల్ అయిపోయే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని అస్సలు వదలొద్దు. మీరు టెన్త్, ఇంజనీరింగ్ డిప్లొమా పాసైతే చాలు ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను మీ సొంతం చేసుకోవచ్చు. రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది. తాజాగా న్యూఢిల్లీలోని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ వివిధ విభాగాల్లో ఆపరేటర్‌ కమ్‌ టెక్నిషియన్‌ ట్రైనీ(ఓసీటీటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 314 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న వారు మార్చి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం సెయిల్ అధికారికి వెబ్ సైట్ https://www.sail.co.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

  • ఆపరేటర్‌ కమ్‌ టెక్నిషియన్ ట్రైనీ(ఓసీటీటీ) పోస్టులు

ఖాళీల సంఖ్య:

  • 314.

విభాగాల వారీగా ఖాళీలు:

మెటలర్జీ:

  • 57 పోస్టులు

ఎలక్ట్రికల్‌:

  • 64

మెకానికల్‌:

  • 100

ఇన్‌స్ట్రుమెంటేషన్‌:

  • 17

సివిల్‌:

  • 22

కెమికల్‌:

  • 18

సిరామిక్‌:

  • 06

ఎలక్ట్రానిక్స్‌:

  • 08

కంప్యూటర్‌/ఐటీ:

  • 20

డ్రాట్స్‌మ్యాన్‌:

  • 02

అర్హతలు:

పదోతరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు మెటలర్జీ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్ ఎలక్ట్రానిక్స్‌, సివిల్‌, మెకానికల్‌, కెమికల్‌, సిరామిక్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాలకు సంబంధించి ఏదో ఒక దానిలో ఇంజినీరింగ్‌ డిప్లొమా చేసి ఉండాలి. ఓసీటీటీ-డ్రాట్స్‌మ్యాన్‌ పోస్టుకు ఏడాది పాటు డ్రాఫ్ట్స్‌మ్యాన్/డిజైన్‌గా పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • 18 – 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం:

  • అభ్యర్థులకు ట్రైనింగ్ సమయంలో రూ. 16 వేల నుంచి 38 వేల వరకు ఉంటుంది. ఆ రెగ్యూలర్ అయిన తర్వాత రూ. 10 లక్షల వార్షిక వేతనం అందిస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడి అభ్యర్థులు రూ. 200 చెల్లిస్తే సరిపోతుంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్‌

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 26-02-2024.

దరఖాస్తుకు చివరితేది:

  • 18-03-2024.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి