iDreamPost

ఒక రూపాయికే కిలో టమాటా! ఎక్కడంటే..

ఒక రూపాయికే కిలో టమాటా! ఎక్కడంటే..

ఇప్పటి వరకు అందరూ సూర్యుడి వేడికి తట్టుకోలేక పోయారు. వానలు పడుతుండటంతో సూర్యుడి ప్రతాపం తగ్గిందనకుంటే.. టమాటాల ధరలు భగ్గుమంటున్నాయి. వాటిని పట్టుకోవాలంటేనే షాక్ కొట్టేలా ధరలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో చూసినా కిలో టమోటా ధర రూ. 100 కు పైగానే ఉండడం అందరినీ షాక్ కు గురి చేస్తోంది. కేజీ టమాట ధర ఏకంగా రూ.250 చేరడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.  ఇక టమాటాలను కొనలేక సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఒక ప్రాంతంలో రూపాయికే కేజీ టమాటాలు ఇస్తున్నారంట. మరి.. ఈ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇటీవల కొంతకాలం నుంచి టమాటాల ధరలు కొండెక్కి కూర్చుకున్నాయి. దిగిరమ్మంటే అక్కడే కూర్చుకుని తెగ బెట్టు చేస్తుంది.  ఇంకా చెప్పాలంటే.. టమాట ధరలు రాకెట్ లో ఆకాశం వైపు దూసుకెళ్తుంది. టమాటా ధరలు చూస్తే.. సామాన్యుల గుండెలు గుబేలు మంటున్నాయి. టమాటాలు లేకుండా కూరలు తిన్నలేక, అంత మొత్తంలో డబ్బులు ఖర్చు చేయలేక సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది అయితే కూరగాయలను కొనడమే మానేసి.. కేవలం పచ్చడి, పప్పులు వంటి వాటితోనే కాలం గడుపుతున్నారు. ఎడారిలో ఒయాసిస్సులో ఒక ప్రాంతంలో రూపాయికే కిలో టమాటాలు ఇస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే కార్యదర్శి ఆర్ఎస్ రాజేష్ రూపాయికే కిలో టమాటాలు ఇస్తున్నాడు.

ప్రజల బాధలను అర్ధం చేసుకుని వారి పార్టీ తరపున ఒక టన్ను టమోటాలను కొనుగోలు చేశాడు. వాటిని రూ.1 కే కిలో లెక్కన విక్రయించారు.  ఈ టమోటాలను ఆర్కే నగర్ నియోజకవర్గంలోని తండయార్ పేట లో 1000 మంది కొనుగోలు చేశారు. ఆ టమాటలను కొనుగోలు చేసిన ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. టమాటా ధరలు ఆకాశానంటిన తరుణంలో ఇలా తక్కువ ధరలో అందించడం సంతోషంగా ఉందని స్థానిక ప్రజలు అంటున్నారు. అలానే  టమాటాలను అందించిన అన్నాడీఎంకే నాయకులకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కాగా పార్టీ కార్యదర్శి అయిన రాజేష్ పళనిస్వామి సూచనల మేరకు ఈ కార్యక్రమం చేసినట్లుగా తెలిపారు. మరి.. రూపాయికే కిలో టమాటాలు ఇవ్వడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయిండి..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి