iDreamPost

ఫేక్ ఫీల్డింగ్? ఆ ప్లేయర్ ఔటా? నాటౌటా? వైరలవుతున్న వీడియో!

ఒమన్ డీ10 లీగ్ లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్ లో నమోదైన రనౌట్.. ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీంతో అది ఔటా? నాటౌటా? అని నెటిజన్లు తెగ చర్చించుతున్నారు.

ఒమన్ డీ10 లీగ్ లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్ లో నమోదైన రనౌట్.. ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీంతో అది ఔటా? నాటౌటా? అని నెటిజన్లు తెగ చర్చించుతున్నారు.

ఫేక్ ఫీల్డింగ్? ఆ ప్లేయర్ ఔటా? నాటౌటా? వైరలవుతున్న వీడియో!

ప్రస్తుతం క్రికెట్ ఫ్యాన్స్ ను ఐపీఎల్ 2024 ఊపేస్తోంది. దేశం మెుత్తం ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ఇలాంటి టైమ్ లో ఓ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒమన్ డీ10 లీగ్ లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్ లో నమోదైన రనౌట్.. ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ఆ బ్యాటర్ ఔటా? నాటౌటా? నిజంగానే ఫేక్ ఫీల్డింగ్ చేశాడా? పూర్తి వివరాల్లోకి వెళితే..

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కొన్ని కొన్ని వివాదాస్పదమైన సంఘటనలు నమోదు అవుతూ ఉంటాయి. అవి ప్రపంచాన్నే ఊపేస్తుంటాయి. అందులో ఒకటి తాజాగా జరిగిన విరాట్ కోహ్లీ ఔట్. కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో హర్షిత్ రాణా వేసిన హైట్ బాల్ కు కోహ్లీ అవుట్ అయ్యాడు. అది నో బాల్ అని, దానికి ఎలా ఔట్ ఇస్తారని చాలా మంది తమ అభిప్రాయాలను తెలిపారు. ఇక కోహ్లీ సైతం తన ఔట్ పై అసంతృప్తిని వెళ్లగక్కాడు. ఈ ఔట్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. కాగా.. ఇలాంటిదే మరో ఔట్ ప్రపంచ క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఒమన్ డీ10 లీగ్ లో భాగంగా తాజాగా రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కాంట్రవర్సీ రనౌట్ నమోదు అయ్యింది. అసలేం జరిగిందంటే? గుబ్రహ్ జెయింట్స్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో క్రీజ్ లో కలైఅర్సన్ ఉన్నాడు. బౌలర్ రాస్పాస్ వేసిన ఈ ఓవర్ లో రెండో బంతిని అర్సన్ డిఫెన్స్ ఆడాడు. రన్ కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలో లెగ్ సైడ్ మిడాఫ్ లో ఉన్న ఫీల్డర్ బంతిని అందుకున్నాడు. అయితే అర్సన్ నాన్ స్ట్రైకర్ వైపు త్రో చేస్తాడని భావించాడు. కానీ అనూహ్యంగా ఫీల్డర్ తల అటు వైపు పెట్టి.. త్రో మాత్రం కీపర్ వైపు విసిరాడు. ఆ బాల్ సరాసరి వికెట్లను తాకింది. ఇంకే ముంది ఇది ఊహించని బ్యాటర్ రనౌట్ గా వెనుదిరిగాడు.

ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారడంతో.. నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇది ఫేక్ ఫీల్డింగ్ అని, ఔట్ కాదని కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఫీల్డర్ ఇంటెలిజెంట్ అంటూ కితాబిస్తున్నారు. అయితే క్రికెట్ లో నిబంధనల ప్రకారం బ్యాటర్ ను కన్ఫ్యూస్ చేసి ఔట్ చేయకూడదు. ఇలా ఫేక్ ఫీల్డింగ్ తో ప్లేయర్లను ఔట్ చేయడం క్రీడాస్ఫూర్తికి విరుద్దం. మరి ఈ వీడియో చూసిన తర్వాత నిజంగానే ఫీల్డర్ ఫేక్ ఫీల్డింగ్ చేశాడా? అది ఔటా? నాటౌటా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి