iDreamPost

ఈ ఒక్క పరీక్ష మీ లైఫ్‌ను మార్చేస్తుంది.. భవిష్యత్తు బంగారమే!

జీవితంలో ప్రతీక్షణం ఎంతో విలువైనది. మీ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఈ ఒక్క పరీక్ష రాస్తే చాలు మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇంతకీ ఆ పరీక్ష ఏంటంటే?

జీవితంలో ప్రతీక్షణం ఎంతో విలువైనది. మీ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఈ ఒక్క పరీక్ష రాస్తే చాలు మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇంతకీ ఆ పరీక్ష ఏంటంటే?

ఈ ఒక్క పరీక్ష మీ లైఫ్‌ను మార్చేస్తుంది.. భవిష్యత్తు బంగారమే!

విద్యార్థులకు ఇది పరీక్షల కాలం. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునేందుకు ప్రతి స్టూడెంట్ కష్టపడి చదువుతూ పరీక్షలకు హాజరవుతున్నారు. ఈ పరీక్షల్లో చూపిన ప్రతిభ, వచ్చిన మార్కులు రేపటి ఉన్నత చదువులకు, ఉన్నత ఉద్యోగాలు సాధించేందుకు కీలకంగా మారనున్నాయి. ఇక ఇంటర్ పూర్తయ్యాక ఏ కోర్సుల్లో చేరాలి? ఏ కోర్సులు చదివితే ఫ్యూచర్ బాగుంటుందని విద్యార్థులు ఆలోచిస్తుంటారు. కోర్సులతో పాటు చదివే విద్యాసంస్థలు కూడా ఉన్నత ప్రమాణాలు కలిగినవి ఎంచుకుంటే భవిష్యత్తుకు తిరుగుండదు. మరి మీరు ది బెస్ట్ యూనివర్శిటీల్లో చేరాలనుకుంటున్నారా? అయితే ఒకే ఒక్క పరీక్ష మీ లైఫ్ ను మార్చేస్తుంది. ఒక్క పరీక్షతో ఏకంగా 54 కేంద్రీయ వర్శిటీల్లో అడ్మిషన్ పొందే అవకాశం కల్పిస్తోంది నేషనల్‌‌‌‌ టెస్టింగ్‌‌‌‌ ఏజెన్సీ. ఆ పరీక్ష మరేదో కాదు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్.

ఇంటర్ పూర్తైన తర్వాత సెంట్రల్ వర్శిటీల్లో డిగ్రీ కోర్సుల్లో చేరాలని భావిస్తే అలాంటి వారికి గొప్ప సువర్ణావకాశం. కేంద్రీయ యూనివర్శిటీల్లో అడ్మిషన్స్ కోసం ఎన్‌‌‌‌టీఏ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ-–యూజీ)- 2024 నోటిఫికేషన్‌‌‌‌ రిలీజ్ చేసింది. మీరు ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, వచ్చిన స్కోర్ ఆధారంగా నేషనల్ లెవల్ లో ఉన్న 54 సెంట్రల్ వర్శిటీల్లో యూజీ కోర్సుల్లో అడ్మిషన్ పొందొచ్చు. సీయూఈటీ-యూజీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆ స్కోర్‌‌‌‌ ఆధారంగా కేంద్రీయ యూనివర్శిటీల్లో వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్, డీమ్డ్ యూనివర్శిటీలు సైతం యూజీ అడ్మిషన్స్ కోసం సీయూఈటీ-–యూజీలో సాధించిన స్కోర్ ను ఆధారంగా చేసుకుంటున్నాయి.

దీంతో ఈ పరీక్షకు ప్రాధాన్యత పెరిగింది. ఇంటర్మీడియట్ పాసైన వారు, ఇంటర్ తత్సమాన అర్హత కలిగిన వారు, ఇంటర్ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్నవారు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభమైంది. మార్చి 26 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది నేషనల్‌‌‌‌ టెస్టింగ్‌‌‌‌ ఏజెన్సీ. మే 15 నుంచి 31 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ-–యూజీ) 13 ప్రాంతీయ భాషల్లో ఎన్టీఏ నిర్వహిస్తోంది. అవి.. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష రాయొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి