iDreamPost

భారతీయులను పెళ్లిళ్లు చేసుకునే వారికి.. కొత్త నిబంధనలు పాటించాలి.

  • Published Feb 17, 2024 | 7:16 PMUpdated Feb 17, 2024 | 7:16 PM

భారతదేశంలో వివాహ బంధం అనేది తరతరాల నుంచి వస్తున్న సంప్రదాయం. అయితే, కాలంతో పాటు కొన్నికొన్ని సంప్రదాయాలు, ఆచార వ్యవరాహారాలు మారుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరో కొత్త నిబంధనలు ప్రవేశ పెడుతూ కొన్ని చట్టాలను తీసుకుని వచ్చారు. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

భారతదేశంలో వివాహ బంధం అనేది తరతరాల నుంచి వస్తున్న సంప్రదాయం. అయితే, కాలంతో పాటు కొన్నికొన్ని సంప్రదాయాలు, ఆచార వ్యవరాహారాలు మారుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరో కొత్త నిబంధనలు ప్రవేశ పెడుతూ కొన్ని చట్టాలను తీసుకుని వచ్చారు. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  • Published Feb 17, 2024 | 7:16 PMUpdated Feb 17, 2024 | 7:16 PM
భారతీయులను పెళ్లిళ్లు చేసుకునే వారికి..  కొత్త నిబంధనలు పాటించాలి.

భారతదేశంలో చాలామంది విదేశాల్లో స్థిరపడిన ఎన్నారైలను పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇలా భారతీయులను పెళ్లి చేసుకొని ఎన్నారైలు మోసగిస్తున్న ఘటనలు పెరిగిపోవడం తీవ్ర ఆందోళనకరంగా మారింది. అలాగే ఆ ఎన్నారైలు పెళ్లి తర్వాత తమ భార్యలను హింసంచడం, లేక వారు అన్యూహంగా మరణించడం వంటి ఘటనలు జరుగుతునే ఉన్నాయి. అయితే వీటన్నిటి పై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు కొత్త చర్యలు చేపట్టింది. ఇక నుంచి ఎన్నారైలు భారతీయులను పెళ్లి చేసుకోవాలంటే ఈ కఠిన నిబంధనలు పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. అదేమిటంటే..

ఎన్నారైలు భారతీయులను పెళ్లి చేసుకుని మోసం చేస్తున్న ఘటనలు రోజు రోజుకూ పెరిగిపోతున్న వేళ కేంద్రం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే.. ఎన్నారైల వివాహాలపై సూచనలు ఇవ్వాలని లా కమిషన్‌ను కేంద్రం ఆదేశించింది. దీంతో సమగ్ర విచారణ జరిపిన లా కమిషన్ తాజాగా కీలక సిఫార్సులు చేసింది. ఇక నుంచి ఎన్నారైలు.. భారతీయులను పెళ్లి చేసుకోవాలంటే అన్ని రకాల నిబంధనలను పాటించాల్సిందేనని ప్రభుత్వ సూచిస్తుంది. అలాగే.. ఎన్నారైలకు సంబంధించిన వివాహాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాలని లా కమిషన్ సూచించింది. ఈ మేరకు ఎన్నారైలు, భారత సంతతి వ్యక్తులతో ముడిపడిన వివాహా సమస్యలపై సమగ్ర చట్టం పేరిట కీలకమైన సిఫార్సులతో.. కూడిన నివేదికను లా కమిషన్ కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖకు అందించింది. ఈ ప్రతిపాదిత చట్టం అనేది సమగ్రంగా ఉండాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ కు రాసిన లేఖలో..
రిటైర్డ్ జస్టిస్ రీతు రాజ్ అవస్తీ పేర్కొన్నారు.

అయితే, నాన్ రెసిడెంట్ ఇండియన్స్-ఎన్‌ఆర్‌ఐ, ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియన్స్-ఓసీఐలతో భారత పౌరులకు జరిగే వివాహాలను.. భారత్‌లో తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలని లా కమిషన్ ప్రధాన సూచన చేసింది. ఈ క్రమంలోనే.. కొత్తగా రూపొందించే చట్టంలో విడాకులు, భాగస్వామికి భరణం, పిల్లల సంరక్షణ, వారి పోషణకు సంబంధించిన నిబంధనలు ఉండాలని తెలిపింది. ఇక ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి వారెంట్లు జారీ చేయడం, నోటీసులు పంపించడానికి నిబంధనలను కూడా స్పష్టంగా పేర్కొనాలని సూచించింది.

ఇక 1967 పాస్‌పోర్ట్‌ చట్టానికి సవరణలు చేస్తూ.. పెళ్లయిన విషయాన్ని బహిరంగంగా ప్రకటించాలని పేర్కొంది. దీంతోపాటు భార్యాభర్తల రెండు పాస్‌పోర్ట్‌లను అనుసంధానం చేసేలా కొత్త రూల్ తీసుకురావాలని చెప్పింది. భార్యాభర్తలు ఇద్దరి పాస్‌పోర్ట్‌లపై మ్యారేజ్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉండేలా చూడాలని తెలిపింది. వివాహ నమోదు సంఖ్య ఎన్నారైల వివాహానికి సాక్ష్యంగా నిలవడంతో పాటు వారి రికార్డుల నిర్వహణకు ఉపయోగపడుతుందని వెల్లడించింది. భార్యభర్తల రికార్డులు హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ వద్ద ఉండాలని.. ఇవే వివరాలు ఆన్‌లైన్‌ పోర్టల్‌లో కూడా అందుబాటులో ఉంచాలని పేర్కొంది. మరి, ఇకపై భారతీయులను పెళ్లి చేసుకోనే ఎన్నారైలకు కేంద్రం కొత్తగా తెచ్చిన నిబంధనల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి