iDreamPost

వీడియో: తెలుగు NRI ఓవరాక్షన్.. బుద్ధి చెప్పిన ఆఫ్రికన్ అమెరికన్స్!

వీడియో: తెలుగు NRI ఓవరాక్షన్.. బుద్ధి చెప్పిన ఆఫ్రికన్ అమెరికన్స్!

ప్రంపచం మొత్తంలో మీరు ఏ దేశానికి వెళ్లినా అక్కడ కనీసం ఒక్క భారతీయుడు అయినా కనిపిస్తాడు. మనవాళ్లు లేని దేశం లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. అందులోనూ మరీ ముఖ్యంగా మన తెలుగు వాళ్లు విదేశాల్లో బాగానే సెటిల్ అయ్యారు. ఇప్పటికీ లక్షల్లో విదేశాలకు చదువులు, ఉద్యోగాలు అంటూ వలస పోతూనే ఉన్నారు. అయితే ఎక్కడికి వెళ్లినా.. ఏ దేశంలో మీరు జీవించాలి అనుకున్న ఒకటి మాత్రం తప్పకుండా ఉండాలి. అదేంటంటే అక్కడి వారికి మర్యాద ఇవ్వడం. అలా ఇస్తేనే తిరిగి మనకు ఆ మర్యాద, అక్కడ ప్రశాంతంగా ఉండేందుకు అవకాశం దొరుకుతుంది. అనువుకాని చోట అధికులం అనరాదు అనే పద్యం అందరికీ గుర్తే ఉండి ఉంటుంది.

అందుకే మనది కాని దేశంలో మనం ఎంతో ఒద్దికగా ఉంటే మంచిది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెబుతున్నామంటే.. అవన్నీ పట్టించుకోకుండా ప్రవర్తించిన వ్యక్తి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అవినాశ్ అనే ఒక యూజర్ ట్విట్టర్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో ఎన్నారై రామయ్య చౌదరి అనే వ్యక్తి కొందరిపై నోరుపారేసుకున్నారు. వారిని బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. అవతలి వాళ్లు చాలాసేపు మౌనంగానే ఉన్నారు. అతను బూతులు తిడుతున్నా చూస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత కాసేపటికి ఆఫ్రికన్ అమెరికన్స్ ను వాళ్ల జాతిని కించపరుస్తూ మాట్లాడాడు. ఇంక తట్టుకోలేక ఒక వ్యక్తి రామయ్య చౌదరిపై దాడి చేశాడు. ఒక్క దెబ్బకు నాకౌట్ చేశాడు. ఆ తర్వాత అంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

రామయ్య అన్న వ్యక్తి మద్యం మత్తులో అలా చేశారా? వారి వల్ల ఏమైనా ఇబ్బంది కలిగితే అలా చేశారా? అనే విషయాలు అయితే తెలియాల్సి ఉంది. ఈ మధ్యకాలంలో విదేశాల్లో ఇండియన్స్ కొట్టుకున్న, రచ్చ చేసిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు వాళ్లు కుమ్ములాటలకు సంబంధించిన వీడియోలు బాగానే వస్తున్నాయి. ఇలాంటి వీడియోలు చూసిన నెటిజన్స్ ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విదేశాల్లో సెటిల్ అయినవాళ్లు.. ఇలాంటి వారికి హితవు పలుకుతున్నారు. మనం ఇక్కడికి ఆనందంగా బతకడానికి వచ్చాం.. ఇలా ఆగం చేసుకోవాడికి కాదు అంటూ బుద్ధి చెబుతున్నారు. అయినా కొందరు మాత్రం మనం ఎందుకు వచ్చాం? ఎక్కడ ఉన్నాం? అనే విచక్షణ మరచి ఇలా వీధి గొడవలకు తెర లేపుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి