iDreamPost

ట్రావిస్- అభిషేక్ కాదు.. అతనే లేకపోతే ఢిల్లీ చేతిలో ఘోర పరాజయమే!

SRH vs DC- The Real Match Winner For SRH: ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో రియల్ మ్యాచ్ విన్నర్ ఎవరు అంటే టక్కున ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ పేర్లు చెప్పేస్తారు. కానీ, అసలు మ్యాచ్ విన్నర్ వేరే ఉన్నారు.

SRH vs DC- The Real Match Winner For SRH: ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో రియల్ మ్యాచ్ విన్నర్ ఎవరు అంటే టక్కున ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ పేర్లు చెప్పేస్తారు. కానీ, అసలు మ్యాచ్ విన్నర్ వేరే ఉన్నారు.

ట్రావిస్- అభిషేక్ కాదు.. అతనే లేకపోతే ఢిల్లీ చేతిలో ఘోర పరాజయమే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో అసలైన మజా ఏంటో క్రికెట్ అభిమానులు చూస్తున్నారు. ఇందుకు ఒకే ఒక కారణం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఏముందిలే హైదరాబాదేగా అనే స్థాయి నుంచి.. అమ్మో హైదరాబాద్ అనే స్థాయికి ఎదిగింది. మ్యాచ్ ఎవరితో అయినా రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ హైదరాబాద్ జట్టు దూసుకుపోతోంది. ఈ ఐపీఎల్ సీజన్ హైదరాబాద్ ఫ్యాన్స్ నిజంగా ఎంతో ప్రత్యేకం అనే చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ప్రదర్శన చూసి చాలా ఏళ్లు గడుస్తోంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ కూడా ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఈ మ్యాచ్ లో విజయంతో హైదరాబాద్ జట్టు టేబుల్ సెకండ్ పొజిషన్ కి చేరుకుంది. ఇదే జోరు కొనసాగితే కప్పు కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో అంతా ట్రావిస్, అభిషేక్ ని పొగిడేస్తున్నారు. కానీ, అసలు మ్యాచ్ విన్నర్ వేరే ఉన్నారు.

ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగింది. కేవలం 5 ఓవర్లలోనే 100 పరుగులు చేసింది. 150 పరుగులు చేసేందుకు కేవలం 11.4 ఓవర్లు మాత్రమే తీసుకున్నారు. అభిషేక్ శర్మ(46), ట్రావిస్ హెడ్(89) ఆటను ఇప్పటికీ ఫ్యాన్స్ మర్చిపోలేకపోతున్నారు. అయితే ఢిల్లీ జట్టు కూడా అలాంటి ధీటైన సమాధానమే చెప్పింది. 7 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసిన హైదరాబాద్ జట్టు కేవలం 67 పరుగులు తేడాతో మాత్రమే విజయం సాధించింది. అంటే ఢిల్లీ జట్టు కూడా గట్టి పోటీనే ఇచ్చింది. 19.1 ఓవర్లలో 199 పరుగులు చేసి ఢిల్లీ జట్టు ఆలౌట్ అయ్యింది. నిజానికి ఢిల్లీ జట్టులో ఆ ఇద్దరూ ఇంకో రెండు ఓవర్లు ఆడి ఉంటే మ్యాచ్ స్వరూమే మారిపోయేది. వాళ్లు మరెవరో కాదు జేక్ ఫ్రాజర్, అభిషేక్ పోరెల్.

జేక్ ఫ్రజార్, అభిషేక్ పోరెల్ హైదరాబాద్ జట్టుకు, ఫ్యాన్స్ కి ఓటమి భయాన్ని రుచి చూపించారు. జేక్ ఫ్రాజర్ ఏకంగా 18 బంతుల్లోనే 65 పరుగులు చేశాడు. అభిషేక్ పోరెల్ 22 బంతుల్లో 42 పరుగులు చేశాడు. వీళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంటే.. వీళ్ల ఆటకు మయాంక్ మర్కండే బ్రేకులు వేశాడు. వీళ్లిద్దరినీ అవుట్ చేసింది మయాంక్ మర్కండేనే. నిజానికి వీళ్లిద్దరి వికెట్లను తీయకపోతే పెను విధ్వంసమే జరిగేది. అలాంటి వాళ్లను పెవిలియన్ కు పంపిన మయాంక్ అసలైన మ్యాచ్ విన్నర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ట్రావిస్ హెడ్, అభిషేక్ మంచి స్కోర్ ఇచ్చారు. కానీ, దానిని సెక్యూర్ చేయడంలో బౌలర్లు సక్సెస్ అయ్యారు కాబట్టే అంత మంచి విజయం దక్కింది. అందులోననూ మయాంక్ మర్కండే ప్రదర్శన అందరినీ మెప్పిస్తోంది. మరి.. అసలైన మ్యాచ్ విన్న మయాంక్ మర్కండేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి