iDreamPost

Temple:సాయంత్రం 6 దాటితే ఈ ఆలయంలోకి ఎవరికీ ప్రవేశం లేదు.. ! కారణం ఏంటంటే..?

  • Published Dec 26, 2023 | 6:29 PMUpdated Dec 26, 2023 | 6:29 PM

దేశంలోనే నమ్మశక్యం కానీ వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. వివిధ ప్రాంతాల బట్టి అక్కడ ఆచారాలు , అలవాట్లు మారుతుంటాయి. ఇక తాజాగా ఓ ఆలయంలో మాత్రం సాయంత్రం అయితే చాలు గుడి తలుపు మూసి వేస్తారు. అంతా నిశ్శబ్ద వాతవరణం గా మారిపోతుంది.

దేశంలోనే నమ్మశక్యం కానీ వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. వివిధ ప్రాంతాల బట్టి అక్కడ ఆచారాలు , అలవాట్లు మారుతుంటాయి. ఇక తాజాగా ఓ ఆలయంలో మాత్రం సాయంత్రం అయితే చాలు గుడి తలుపు మూసి వేస్తారు. అంతా నిశ్శబ్ద వాతవరణం గా మారిపోతుంది.

  • Published Dec 26, 2023 | 6:29 PMUpdated Dec 26, 2023 | 6:29 PM
Temple:సాయంత్రం 6 దాటితే ఈ ఆలయంలోకి ఎవరికీ ప్రవేశం లేదు.. ! కారణం ఏంటంటే..?

భారత దేశంలో అనేక ప్రసిద్ది చెందిన దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో చరిత్ర కలిగిన దేవాలయాలు వెలసి ఉండటం ప్రత్యేకం. ఇక అందులో కొన్ని దేవతలు, రాజులు నిర్మించిన అతి పురాతనమైన దేవాలయాలు కూడా ఉన్నాయి. కాగా, కొన్ని కొన్ని ఆలయాల్లో మాత్రం కొన్ని వింత ఆచారాలు సంప్రదాయాలు పాటిస్తుంటారు. అంతేకాకుండా అక్కడ పూజా విధానం కూడా ఒక్కో విధంగా ఉంటుంది. ఈ క్రమంలోనే.. కొంతమంది దేవుడికి మాంసాన్ని ప్రసాదంగా పెడతారు. మరికొన్ని ప్రాంతాల్లో అయితే ఏకాంగా మద్యాన్ని దేవుడికి నైవేద్యంగా పెడతారు. ఇలా ఒక్కో ప్రాంతంలో అక్కడ విశిష్టతను బట్టి భక్తులు రకరకాలుగా దేవుడిని కొలుస్తుంటారు. ఇక ఆలయాలు తెరవడం , మూసివేసే సమయాలు కూడా కాస్తా భిన్నంగా ఉంటాయి. కానీ, తాజాగా ఓ దేవాలయంలో మాత్రం సాయంత్రం అయితే చాలు ఎవరినీ లోపలికి అనుమతించని ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా..? ఈ గుడి ఎక్కడ ఉంది..? దాని విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా ఆలయాలు ఉదయం 5 గంటలకు తెరచి మరల మధ్యహ్నం ఒంటిగంట ప్రాంతంలో మూసివేస్తారు. మళ్లీ తిరిగి నాలుగు గంటలకు తెరిచి రాత్రి 8 గంటలకు మూసివేస్తారు. ఇది సహజంగా జరిగిన పక్రియ. అయితే ఎక్కడైనా సాయంత్రం 6 గంటలకు మూసివేసే ఆలయాల గురించి ఎప్పుడు వినకపోయుంటారు. అయితే ఆ ఆలయం ఎక్కడ ఉందంటే.. బీహార్‌లోని మాధేపూర్ జిల్లా ఆలంనగర్ తాలూకాలోని ఒక గ్రామంలో ఉంది. అక్కడ ఆ పురాతనమైన ఆలయం పేరు డాకిని. ఈ గుడిలో ప్రత్యేకత ఏమిటంటే.. దేవుడికి రోజంతా 5 సార్లు హారతి నిర్వహిస్తారు. ఇక సాయంత్రం 6 అయితే చాలు ఈ ఆలయంలో భక్తులకు ప్రవేశం నిషిద్ధం.తిరిగి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు మాత్రమే తెరుస్తారు.

No one can enter this temple after 6 pm

అయితే సాయంత్రం 6 తర్వాత ఆలయంలోకి ఎందుకు అనుమతి లేదంటే.. అక్కడ ప్రజల విశ్వాసాల ప్రకారం సాయంత్రం 6 తర్వాత డాకినీ మాత స్వయంగా ఆలయ సముదాయాన్ని సందర్శిస్తుందని నమ్ముతారు. అలా అమ్మవారు ఆలయంలో తిరుగుతున్న సమయంలో ఎవరూ చూడకూడదని అక్కడ ప్రజల నమ్మకం. ఒకవేళ చూస్తే అమ్మవారి ఆగ్రహానికి గురి కావాల్సిందని అంటారు. అందుకే సాయంత్రం 6 గంటల తర్వాత ఈ ఆలయాన్ని సందర్శించడమనేది నిషిద్ధం. ఆ సమయంలో ఆలయ పూజారులు కూడా గుడి నుంచి వెళ్లిపోతారు. సాయంత్రం హారతి అనంతరం ఆలయ తలుపులు మూసివేస్తారు.

ఇక ఈ ఆలయం 1348లో స్థాపించబడింది. ఈ ఆలయాన్ని దుర్గామాత దేవాలయం అని కూడా అంటారు. ఇక్కడ అమ్మవారికి మేకలను బలిగా ఇస్తారు. చాలా ఏళ్లుగా ఇక్కడ ఇదే ఆచారం కొనసాగుతూ వస్తోంది. అలాగే ఇక్కడ అమ్మవారికి లడ్డూలు నైవేద్యంగా పెట్టడం అనేది శుభప్రదంగా భావిస్తారు. మరి ఈ వింత ఆచారాన్ని పాటిస్తున్న ఆలయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి