గ్రామ న్యాయాలయ వ్యవస్థ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధమైంది. ముందస్తుగా 11 జిల్లాల్లో 84 చోట్ల వీటని ప్రారంభించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వీటి ప్రారంభానికి అవసరమైన వసతి, వాహనం, కార్యాలయ సామగ్రి, పరికరాలను సమకూర్చడానికి ఒకొక్క గ్రామ న్యాయాలయానికి రూ.18లక్షల చొప్పున కేంద్రం నిధులు కేటాయించనుంది. కేంద్రం చూపించిన విధివిధానాల ప్రకారం మొదటి మూడు సంవత్సరాల పాటు కేంద్రం నుండి
రూ.3.2లక్షలు రూపాయలు 50 శాతం వాటాగా ప్రతి న్యాయాలయానికి ఇవ్వనుంది. వీటిని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వీటి నిర్వహణ చూడాల్సి ఉంటుంది. జిల్లాల్లోని కొన్ని పంచాయతీలను కలిపి ఒక గ్రామ న్యాయాలయంగా ఏర్పాటు కానున్నాయి. ఈ విధంగా ప్రతి న్యాయాలయం యొక్క పరిధిని ప్రకటించాల్సి ఉంటుంది.
ఈ న్యాయలయాల్లో న్యాయాధికారితో పాటు, హెడ్ క్లర్క్, టైపిస్టు, స్టెనో, అటెండరు ఉంటారు. కేంద్ర ప్రభుత్వం 2009లో దేశవ్యాప్తంగా గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు చట్టం చేసిన సంగతి తెలిసిందే. మూడు రోజుకు క్రితం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంతో ఈ వ్యవస్థ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
రాష్ట్ర విభజన తో 84 న్యాయాలయాలు ఏపీలో ఏర్పాటు కానున్నాయి.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 139 గ్రామ న్యాయాలయాలకు ప్రతిపాదనలు అందగా తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ఈ చట్టాన్ని అమలు చేయడంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయి..అయితే కేంద్రం విడుదల చేసిన గెజిట్ ప్రకారం కర్నూలు, కడప జిల్లాల్లో ఒక్కటీ లేకపోవడంతో వీటి సంఖ్యను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుండి అనుమతి కోరే అవకాశం ఉంది.
ప్రస్తుతం 11 రాష్ట్రాల్లో 343 గ్రామ న్యాయాలయాలను నోటిఫై చేయగా 9 రాష్ట్రాల్లో 210 మాత్రమే పనిచేస్తున్నాయని. గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి అనూప్ కుమార్ తెలిపారు. దీనికి కేంద్రం ఆర్థిక సహకారం అందిస్తుందని తెలిపారు.మొదటిగా సదుపాయాలు సమకూర్చడానికి 18 లక్షకు,ఆ తదుపరి ఏడాది నుండి 3.25 లక్షల రూపాయలు మూడేళ్లపాటు అందిస్తుందని.తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సమక్షంలోనే నిర్వహణ జరగాలని ఆయన చెప్పారు.
న్యాయ కార్యాలయాల విధి విధానాలు ఇవే
మొదటి తరగతి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ర్యాంకు కలిగిన న్యాయాధికారి ఆధ్వర్యంలో ఈ న్యాయాలయాలు నడుస్తాయి. గ్రామాల్లో జరిగే సివిల్, క్రిమినల్ కేసులు,2 ఏళ్ల లోపు శిక్ష పడే కేసులను మాత్రమే విచారించి తీర్పులు చెప్పే పరిధి వీటికి ఉంటుంది..,స్థలం తగాదా కేసులు, కాలువ గట్టు కేసులు, నీటి పంపిణీ దగ్గర వచ్చే వివాదాలు, పొలం సరిహద్దు వివాదాలను విచారించవచ్చు. సదరు న్యాయాధికారి రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టు సలహాతో నియమించాల్సి ఉంటుంది..