iDreamPost
android-app
ios-app

టాటాకే కొత్త పార్లమెంట్ నిర్మాణ కాంట్రాక్టు

టాటాకే కొత్త పార్లమెంట్ నిర్మాణ కాంట్రాక్టు

నూతన పార్లమెంట్ భవన నిర్మాణ కాంట్రాక్టును టాటా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ దక్కించుకుంది. పార్లమెంట్ భవనం పాతది కావడంతో అనేక భవిష్యత్ అవసరాల రీత్యా నూతన పార్లమెంట్ నిర్మాణం చేపట్టాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నూతన పార్లమెంటు భవన నిర్మాణానికి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ బిడ్లను ఆహ్వానించగా టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 861.90 కోట్లకు బిడ్ చేసి కాంట్రాక్ట్‌ దక్కించుకుంది.

పార్లమెంట్ నిర్మాణానికి నిర్వహించిన బిడ్లలో ముఖ్యంగా టాటా, ఎల్‌ అండ్‌ టీ సంస్థలు పోటీ పడ్డాయి. కాగా ఎల్ అండ్ టీ సంస్థకన్నా తక్కువగా కోట్ చేసిన టాటా నిర్మాణ కాంట్రాక్టు సాధించింది. ఎల్ అండ్ టీ సంస్థ 865 కోట్లకు బిడ్ వేయగా టాటా సంస్థ అంతకంటే 3.10 కోట్లు తక్కువగా 861.90 కోట్లకు బిడ్ వేసినట్లు సమాచారం.

కాగా నూతన పార్లమెంట్ నిర్మాణ కాంట్రాక్టును దక్కించుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన టాటా కంపెనీ మరో ఏడాదిలో నూతన పార్లమెంటు నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు తెలిపింది. పార్లమెంట్ నిర్మాణంలో పాలు పంచుకోవడం పట్ల గర్వంగా ఉందని టాటా గ్రూప్ పేర్కొంది. త్రిభుజాకారంలో నిర్మించబోతున్న పార్లమెంట్ భవనం పాత పార్లమెంట్ కన్నా పెద్దదిగా విశాలంగా ఉంటుందని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ తెలిపింది.