iDreamPost
iDreamPost
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ ) అధ్యక్ష పదవికి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నామినేషన్ దాఖలు చేశారు. ముంబైలో సోమవారం నామినేషన్ దాఖలు అనంతరం సౌరవ్ మీడియాతో మాట్లాడారు. బీసీసీఐ ని గాడిలో పెట్టేందుకు ఇదే సరైన సమయమని, అందుకే తాను వచ్చానని పేర్కొన్నారు. అధ్యక్ష పదవికి దాదా ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో గంగూలీ ఎన్నిక లాంఛనమే కానుంది. అభిమానులు ముద్దుగా దాదా అని పిలుచుకునే ఈ బెంగాల్ టైగర్ భారత విజయవంతమైన కెప్టెన్ గా పేరొందారు.