iDreamPost
android-app
ios-app

టీడీపీ మేనిఫెస్టో మీద చర్యలా ? నిజంగానే….!

  • Published Feb 04, 2021 | 5:10 PM Updated Updated Feb 04, 2021 | 5:10 PM
టీడీపీ మేనిఫెస్టో మీద చర్యలా ? నిజంగానే….!

రాజకీయ పార్టీల రహితంగా జరిగే ఎన్నికలకి ఈ దేశంలో ఎప్పుడు ఏక్కడా జరగని విధంగా రాజ్యాంగనికి వ్యతిరేకంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పల్లె ప్రగతి – పంచ సూత్రాల పేరుతో మానిఫెస్టోని విడుదల చేసి అందరిని ఆశ్చర్య పరిచారు. 40ఏళ్ళ రాజకీయం అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఈ విధంగా చేయడం ఎంటి అని రాజకీయ విశ్లేషకులు సైతం పలు మీడియా చర్చల్లో చంద్రబాబు తీరుని తప్పు పట్టిన సంగతి తెలిసిందే

అయితే చంద్రబాబు పంచాయతీ ఎన్నికలకి రాజ్యాంగ విరుద్దంగా మానిఫెస్టోని విడుదల చేయడమే కాకుండా ఆ మానిఫెస్టో పత్రంపై ఆయన ఫోటోని , ఆయన కుమారుడి ఫోటోని , పార్టీ గుర్తుని ప్రచురించి ప్రచారం చేసుకోవడాన్ని సీరియస్ గా తీసుకున్న అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు వ్యవహారంపై ఎన్నికల కమీషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. మొదటి నుండి తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ వ్యవహారంపై కళ్ల ముందు జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనపై స్పందించి తీరాల్సిందే అని డిమాండ్ చేశారు.

వైయస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేయడం, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ఎస్.ఈ.సీ కి ఫిర్యాదు చేయడం అలాగే రాష్ట్రంలో వివిధ వర్గాలు చంద్రబాబు చేసిన పనిని తప్పు పట్టడం, ప్రజల్లో మానిఫెస్టో విడుదలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో స్పందించిన ఎన్నికల కమీషన్ నిమ్మగడ్డ రమేష్ టీడీపి మానిఫెస్టోలో ప్రచురణ కర్తగా పేర్కొన్న పార్టీ ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకట రాజును ఫిబ్రవరి 2వ తారీకు లోపు వివరణ ఇవ్వాల్సిందిగా లేఖ రాసారు.

ఇది ఇలా ఉంటే తాజాగా పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలపై టీడీపీ వివరణను పరిశీలించిన ఎస్‌ఈసీ. ఆ వివరణ సంతృప్తికరంగా లేదని మేనిఫెస్టో విడుదల ఎన్నికల కోడ్ కు విరుద్దం అంటు మేనిఫెస్టోను టీడీపీ ఉపసంహరించుకోవాలని టీడీపీకి ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలకు పంపిన మేనిఫెస్టో కాపీలను వెనక్కి తీసుకోవాలని సూచన చేస్తూ మేనిఫెస్టోతో ఎలాంటి ప్రచారం నిర్వహించవద్దని ఎస్‌ఈసీ టీడీపీకు స్పష్టం చేసింది. అయితే ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.